PAWAN KALYAN RANA DAGGUBATI AYYAPUNAM KOSHIYAM TELUGU REMAKE LATEST UPDATE FOR REPUBLIC DAY EVENT TA
Pawan Kalyan - Rana: రిపబ్లిక్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా మూవీపై క్రేజీ అప్డేట్..
పవన్ కళ్యాణ్, రానా (File/Photos)
Pawan Kalyan - Rana: : పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
Pawan Kalyan - Rana: : పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. ఇప్పటికే వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తూనే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సాగర్ కే. చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో విశాలమైన లాడ్జ్ సెట్‌ను వేసారు. మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినట్టు ఓ వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోలో సుధ లాడ్జ్‌లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తోన్న వీడియోను రిలీజ్ చేసారు. ఈ వీడియోలో ఈ సినిమాను ఈ యేడాదే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఈ ఇయర్ పవన్ కళ్యాణ్ నుంచి మూడు సినిమాలు వచ్చే అవకాశాలున్నాయి.
వీలైతే.. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్ట్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సినిమా కోసం పవన్ నెలన్నర రోజుల డేట్స్ కేటాయించాడని టాక్. పవన్ కల్యాన్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఈ తెలుగు రీమేక్‌లో ఓ ష్లాఫ్ బ్యాక్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేశారట. పవన్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేలా ఈ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని అంటున్నారు. మలయాళంలోని లేని ఫ్లాష్ బ్యాక్ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి. ఈ సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తే.. రిటైర్డ్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో రానా దగ్గుబాటి పాత్ర ఉంటుంది. అలాగే రానా సరసన సాయి పల్లవి, పవన్ కళ్యాణ్ సరసన ఐశ్వర్య రాజేష్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్, రానా (File/Photos)
ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్,రానా లపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రానా, పవన్ కళ్యాణ్ పై దాదాపు 70 శాతం తెరపై కలిసి కనిపించనున్నారు. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అదే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.