Pawan Kalyan - Rana: పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్, రానా కలిసి నటిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్స్ దాదాపు ఖరారయ్యారు.
Pawan Kalyan - Rana: : పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక సార్వత్రిక ఎన్నికలకు చాల సమయం ఉండటంతో ఈ లోపు వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ కోవలోనే ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. ఇప్పటికే వకీల్ సాబ్’ టీజర్‌ను విడుదల చేస్తే.. మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలిసారి లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాల్సి ఉన్నా.. ముందుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారని సమాచారం.
ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ‘స్క్రీన్ ప్లేతో పాటు మాటల అందిస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఐశ్వర్య రాజేష్ పేరును దాదాపు ఖరారైంది. మరోవైపు రానాకు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. వీళ్లిద్దరు ప్రస్తుతం ‘విరాట పర్వం’లో నటిస్తున్నారు. ఆ సినిమాలో జోడిగా నటిస్తున్నారా లేదా అనే విషయం పక్కనపెడితే.. మరోసారి ఈ సినిమాలో మాత్రం భార్య భర్తలుగా నటిస్తున్నారు.
ఐశ్వర్య రాజేష్, సాయి పల్లవి (File/Photos)
సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సాగర్ కే. చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో విశాలమైన లాడ్జ్ సెట్‌ను వేసారు. జనవరి 20 నుంచి కంటిన్యూగా 25 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుంది.
పవన్ కళ్యాణ్, రానా (File/Photos)
ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్,రానా లపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రానా, పవన్ కళ్యాణ్ పై దాదాపు 70 శాతం తెరపై కలిసి కనిపించనున్నారు. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. అదే ఫైనల్ అయ్యే అవకాశాలున్నాయి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.