Pawan Kalyan : సంక్రాంతి బరిలో పవన్ కళ్యాణ్.. ఈ సారి కూడా పోటి తప్పదా..

పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

  • Share this:
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్.. అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా 50 శాతం షూటింగ్‌ను పూర్త చేసుకుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా గురించి మరో క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను ఆగస్టు వరకు పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలనీ చూస్తున్నారట దర్శక నిర్మాతలు. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటన విడుదలకావాలసి వుంది. ఈ సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ జూలై 11 నుండి పాల్గోననున్నారట. ఇక ఏకధాటిగా ఆగస్టు వరకు షూట్ చేసి సంక్రాంతి బరిలో నిలవాలనీ చూస్తున్నారట చిత్రబృందం. ఇక బాలయ్య అఖండ కూడా సంక్రాంతి బరిలో ఉందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారి పండుగ వాతావరణం ఎలా ఉండనుందో..

    ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. మలయాళంలో పృధ్వీరాజు సుకుమారన్ నటించిన పాత్రలో రానా చేస్తున్నారు. బీజు మీనన్ చేసిన పాత్రలో పవన్ కనిపించనున్నారు. ఈ సినిమాలో రానా సరసన నివేధా పేతురాజ్ నటిస్తుండగా.. నిత్య మీనన్ పవన్ కళ్యాణ్ సరసన కనిపించనుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.

    ఇక పవన్ నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఎన్నికలకు సమయం ఉన్నందున.. పవన్ ఆ ఖాలీ సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తున్నారు. అందులో పలు సినిమల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న హరి హర వీరమల్లు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నారు పవన్ కళ్యాణ్.
    Published by:Suresh Rachamalla
    First published: