హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీకి అదిరిపోయే టైటిల్.. ఖుషీ చేసుకుంటున్న ఫ్యాన్స్..

Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీకి అదిరిపోయే టైటిల్.. ఖుషీ చేసుకుంటున్న ఫ్యాన్స్..

ఈ టైటిల్ పెట్టినపుడే రానాకు అన్యాయం జరిగిందని అంతా ఫిక్సైపోయారు. ఒరిజినల్‌లో ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ అంటే అయ్యప్పన్, కోశీ.. ఇద్దరి పేర్లు ఉన్నాయి. తెలుగులో అలా కాకుండా కేవలం పవన్ పేరు పెట్టారు. దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా కూడా తెరవెనక మాత్రం అంతా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాస్తున్నాడు.

ఈ టైటిల్ పెట్టినపుడే రానాకు అన్యాయం జరిగిందని అంతా ఫిక్సైపోయారు. ఒరిజినల్‌లో ‘అయ్యప్పునుమ్ కోశీయుమ్’ అంటే అయ్యప్పన్, కోశీ.. ఇద్దరి పేర్లు ఉన్నాయి. తెలుగులో అలా కాకుండా కేవలం పవన్ పేరు పెట్టారు. దర్శకుడు సాగర్ కే చంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా కూడా తెరవెనక మాత్రం అంతా త్రివిక్రమ్ చూసుకుంటున్నాడు. స్క్రీన్ ప్లే, మాటలు కూడా ఆయనే రాస్తున్నాడు.

Pawan Kalyan - Rana : ఈ రోజు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా మూవీకి అదిరిపోయే టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు చిత్ర యూనిట్..

  Pawan Kalyan - Rana : దాదాపు రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్.. ‘వకీల్ సాబ్’ మూవీతో టాలీవుడ్‌లో  పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో కమ్ బ్యాక్ ఇచ్చారు. ఈ సినిమాలో ‘వకీల్ సాబ్’గా పవన్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ముందుగా..   పవన్ కళ్యాణ్, రానతో కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా  ఈ మూవీకి అదిరిపోయే టైటిల్ ఫిక్స్ చేసారు. దీంతో పవర్ స్టార్ అభిమానులు ఖుషీ చేసుకుంటున్నారు.  వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో కలిసి మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు రీమేక్ చేస్తున్నారు. ఈ రోజు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ను విడుదల చేసారు. అందరు అనుకున్నట్టుగానే ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పవన్ కళ్యాణ్.. అరే డేని బయటకు రారా.. కొడుకా అంటూ పవన్  అరుస్తు రావడంతో ఈ టీజర్ ప్రారంభమవుతోంది. చివర్లో డేని.. డేనియల్ శేఖర్.. అంటూ రానా చెప్పే వాయిస్‌తో ఎండ్ అవుతోంది. భీమ్లా.. భీమ్లా నాయక్.. కింద క్యాప్షన్ లేదా అంటూ చెప్పడంతో ఈ సినిమా టీజర్ ఎండ్ చేసారు. అంతేకాదు మరోసారి జనవరి 12 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

  ఇప్పటికే ‘భీమ్లా నాయక్’గా పవన్ కళ్యాణ్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు మాస్‌లో ‘భీమ్లా నాయక్’ పేరు వెళ్లిపోయింది. దీంతో చిత్ర యూనిట్ ఈ సినిమాకు ఇదే టైటిల్ ఫిక్స్ చేసారు. దాంతో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు.

  ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలోను నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో షూటింగ్ రీ స్టార్ట్ చేయనుంది. ఏ యం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం.మరోవైపు రానా హీరోగా నటించిన ‘విరాట పర్వం’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా లేదా థియేటర్స్‌లో విడుదల చేస్తారా అనే విషయమై సందిగ్థం నెలకొంది.

  ఇవి కూడా చదవండి

  Ram Charan: జాతీయ పతాకాన్ని అవమానపరిచాడంటూ రామ్ చరణ్ పై మండిపడుతున్న నెటిజన్స్..

  Independence Day 2021: టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై సైనికుడి పాత్రలో మెప్పించిన హీరోలు..


  Venkatesh@35Years : టాలీవుడ్‌లో హీరోగా 35 యేళ్లు పూర్తి చేసుకున్న వెంకటేష్.. విక్టరీ హీరో కెరీర్‌‌‌లో టాప్ సినిమాలు ఇవే..


  HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..


  Pooja Hegde: కాటుక కళ్లతో మాయ చేస్తోన్న బుట్టబొమ్మ .. పూజా హెగ్డే గ్లామర్‌కు ఫ్యాన్స్ ఫిదా..

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Pawan kalyan, Rana daggubati, Saagar K Chandra, Sithara Entertainments, Trivikram

  ఉత్తమ కథలు