• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN RANA AYYAPPANUM KOSHIYUM REGULAR SHOOTING STARTS FROM JANUARY 20 TA

Pawan Kalyan - Rana: పవన్ కళ్యాణ్, రానా సినిమాపై క్రేజీ అప్‌డేట్..

Pawan Kalyan - Rana: పవన్ కళ్యాణ్, రానా సినిమాపై క్రేజీ అప్‌డేట్..

పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి (pawan kalyan and rana daggubati)

Pawan Kalyan - Rana:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ..ముందుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు ముహూర్తం ఖరారైంది..

  • Share this:
    Pawan Kalyan - Rana:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసాడు. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాల్సి ఉన్నా.. ముందుగా మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. మల్లూవుడ్‌లో బిజూ మీనన్, పృథ్వీరాజ్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బిజూ మీనన్ పాత్రలో నటిస్తుండగా.. రానా దగ్గుబాటి పృథ్వీరాజ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ సుమారు 40 రోజులు డేట్స్ కేటాయించారట.

    ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా .. సంక్రాంతి తర్వాత ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటకే హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో విశాలమైన లాడ్జ్ సెట్‌ను వేస్తున్నారు. జనవరి 20 నుంచి కంటిన్యూగా 25 రోజులు పాటు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఈ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్,రానా లపై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ పవన్ కళ్యాణ్ పై దాదాపు 70 శాతం తెరపై కలిసి కనిపించనున్నారు. ఈ సినిమాకు బిల్లా రంగా అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. దాదాపు అదే ఖాయం అయ్యే అవకాశాలున్నాయి.

    Pawan Kalyan Latest Movie Ayyappanum Koshiyum Remake Who Will be lead another character opposite power star Here are the details,pawan kalyan, Pawan Kalyan news, Pawan kalyan latest film,Pawan Kalyan Latest Movie Ayyappanum Koshiyum Remake,nithin with pawan, krish, am ratnam, Pawan Kalyan ayyappanum koshiyum remake, పవన్ కళ్యాణ్, విరూపాక్ష, తెలుగు సినిమాలు, క్రిష్,నితిన్,Nithin news, nithin films,పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్
    అయ్యుప్పునుమ్ కోషియుమ్ (బిల్లా రంగా): పవన్ కళ్యాణ్, రానా-సాగర్ కే చంద్ర


    ఈ చిత్రంలో రానా సరసన నివేథా పేతురాజ్ నటిస్తుండగా.. వపన్ కళ్యాణ్ సరసన సాయి పల్లవి పేరును పరిశీలిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక పవన్ నటిస్తోన్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఎన్నికలకు సమయం ఉన్నందున.. పవన్ ఆ ఖాళీ సమయాన్ని సినిమాలకు వెచ్చిస్తున్నాడు. అందులో భాగంగా ఆయన హిందీలో సూపర్ హిట్ అయినా పింక్‌ తెలుగు రీమేక్‌లో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాను దిల్ రాజు, బోణి కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకుడు. ఈ సినిమాతో పాటు పవన్ మరో రెండు సినిమాలను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రి 6 గంటల 3 నిమిషాలకు విడుదల కానుంది.

    Pawan Kalyan Latest Movie Ayyappanum Koshiyum Remake Who Will be lead another character opposite power star Here are the details,pawan kalyan, Pawan Kalyan news, Pawan kalyan latest film,Pawan Kalyan Latest Movie Ayyappanum Koshiyum Remake,nithin with pawan, krish, am ratnam, Pawan Kalyan ayyappanum koshiyum remake, పవన్ కళ్యాణ్, విరూపాక్ష, తెలుగు సినిమాలు, క్రిష్,నితిన్,Nithin news, nithin films,పవన్ కళ్యాణ్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్
    పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    అందులో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఒకటి. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈ సినిమా. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. విరూపాక్ష అనే పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం. ఈ సినిమాతో పాటు పవన్ హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో  సినిమాలు చేయనున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: