Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీ నుంచి అదిరిపోయిన క్రేజీ అప్డేట్..

పవన్ కళ్యాణ్,రానా (Twitter/Photo)

Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీ అదిరిపోయిన క్రేజీ అప్డేట్.. వివరాల్లోకి వెళితే..

  • Share this:
    Pawan Kalyan - Rana : పవన్ కళ్యాణ్, రానా మూవీ అదిరిపోయిన క్రేజీ అప్డేట్.. వివరాల్లోకి వెళితే.. సెకండ్ ఇన్నింగ్స్‌లో పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూకుడు మీదున్నారు. ఇప్పటికే పలు చిత్రాలను ఓకే చేసారు. అందులో మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ మూవీ రీమేక్ ఒకటి. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ .. భీమ్లా నాయక్’ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో రానాకు జోడిగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు.

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విడుదల  చేస్తున్నట్టు ప్రకటించారు.


    పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాలోను నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కూడా త్వరలో షూటింగ్ రీ స్టార్ట్ చేయనుంది. ఏ యం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామా కావడంతో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో అప్పీల్ కావడంతో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం.మరోవైపు రానా హీరోగా నటించిన ‘విరాట పర్వం’ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తారా లేదా థియేటర్స్‌లో విడుదల చేస్తారా అనే విషయమై సందిగ్థం నెలకొంది.

    ఇవి కూడా చదవండి.. 

    Nagarjuna - Jr NTR : నాగార్జునకు పెద్ద తల నొప్పిగా మారిన ఎన్టీఆర్ .. మరోసారి అక్కినేని Vs నందమూరి..


    HBD Sridevi : అప్పటి తరంలో శ్రీదేవి.. ఈ తరంలో కాజల్, తమన్నా..


    Shankar - Lingusamy: తెలుగు ఇండస్ట్రీ పై ఫోకస్ పెడుతున్న తమిళ దర్శకులు.. శంకర్ నుంచి లింగుస్వామి వరకు టాలీవుడ్ పై దండయాత్ర...


    Controversial Photoshoots: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఫోటోషూట్స్ ఇవే..


    Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..

    Published by:Kiran Kumar Thanjavur
    First published: