Pawan Kalyan - Rajamouli: పవన్ కళ్యాణ్, రాజమౌళి కాంబినేషన్ అలా మిస్ అయిందా.. ? ఇంతకీ ఏ సినిమా అంటే..

పవన్ కళ్యాణ్, రాజమౌళి (File/Photo)

Pawan Kalyan - Rajamouli: అపజయం ఎరగని దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు.

  • Share this:
    Pawan Kalyan - Rajamouli: అపజయం ఎరగని దర్శక బాహుబలి రాజమౌళి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. వీళ్ల కాంబినేషన్‌లో సినిమా ఎపుడు తెరకెక్కుతుందా అని ఫ్యాన్స్ కూడా ఎంతో కసితో వెయిట్ చేస్తున్నారు. అయితే.. రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కాల్సింది. కానీ అనుకోని కారణాలతో ఈ చిత్రం పట్టాలెక్కపోయింది. ఇంతకీ రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించాల్సిన ఆ సినిమా ఏమిటో కాదు విక్రమార్కుడు మూవీ. ముందుగా జక్కన్న ఈ స్టోరీని పవన్ కళ్యాణ్‌ను వినిపించాడట. ఈ స్టోరీ విని పవన్ కళ్యాణ్ కూడా ఇంప్రెస్ అయ్యాడట. కానీ అప్పటికే పవన్ కళ్యాణ్ ’బంగారం’ సినిమా చేస్తున్నారు. అంతేకాదు ఆ వెంటనే ‘అన్నవరం’ సినిమాకు డేట్స్ కూడా ఇచ్చేసడట. ఈ రకంగా తనకున్న కమిట్‌మెంట్స్‌తో   బిజీగా ఉండటంతో ఈ సినిమాకు నో చెప్పాడట.

    అంతేకాదు ‘అన్నవరం’ తర్వాత పవన్ కళ్యాణ్ కొంత కాలం సినిమాలకు విరామం తీసుకోవాలనుకున్నారు. ఈ నేపథ్యంలో ‘విక్రమార్కుడు’ సినిమాను చేయలేనని రాజమౌళికి చెప్పాడట. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఓకే చేసి ఉంటే.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచేది. ఈ సినిమాను రాజమౌళి.. రవితేజ హీరోగా తెరకెక్కించారు.

    Pawan Kalyan - Rajamouli Power Star Pawan Kalyan Rejected Rajamouli Vikramarkudu Movie Ravi Teja Done That Role,Pawan Kalyan,Rajamouli,Pawan Kalyan Rajamouli,Ravi Teja Vikramarkudu,Pawan Kalyan Rajamouli Vikramarkudu,Pawan Kalyan Twitter,Pawan Kalyan Rajamouli Combination Miss,RRR,Tollywood,Rajamouli PAwan Kalyan Missed Vikramarkudu,విక్రమార్కుడు,పవన్ కళ్యాణ్,రాజమౌళి,రాజమౌళి పవన్ కళ్యాణ్,రాజమౌళితో పవన్ కళ్యాణ్‌ మూవీ మిస్,విక్రమార్కుడు మూవీ అలా మిస్ అయింది,రవితేజ విక్రమార్కుడు
    ’విక్రమార్కుడు’ రవితేజ (Ravi Teja)


    ఈ చిత్రంలో రవితేజ రెండో సారి ద్విపాత్రాభినయం చేసారు. పోలీస్ ఆఫీసర్ విక్రమ్ రాథోడ్‌గా, దొంగ అత్తిలి సత్తిబాబు పాత్రలో ఏ రేంజ్‌లో ఇరగదీసిన సంగతి తెలిసిందే కదా. రూ. 11 కోట్ల బడ్జెట్‌తో  తెరకెక్కిన ఈ సినిమా రూ. 26 కోట్ల షేర్ రాబట్టింది. ఈ సినిమా వివిధ భాషల్లో రీమేకై అన్ని భాషల్లో సూపర్ హిట్టైయింది. హిందీలో ‘రౌడీ రాథోడ్’గా అక్షయ్ కుమార్ హిట్ అందుకుంటే.. తమిళంలో ‘సిరుతై’గా కార్తి మంచి హిట్ అందుకున్నారు. ఈ రకంగా కన్నడతో పాటు బెంగాలీ భాషల్లో కూడా ఈ సినిమా రీమేకై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో హీరోగా రవితేజ మార్కెట్ కూడా బాగా పెరిగింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: