Pawan Kalyan - Puri Jagannadh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి. దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టరు. ఆ తర్వాత చేసిన ‘బాచి’ సినిమాతో ఫ్లాప్ మూట గట్టుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసాడు. దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో సినిమా కంటే ముందు పూరీ జగన్నాథ్.. సూపర్ స్టార్ కృష్ణతో 1996లో ఓ సినిమా మొదలు పెట్టారు. ఆ సినిమాను అనుకున్న సమయానికే పూర్తి చేసినా ఏవో కారణాల వల్ల విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాకు ‘థిల్లానా’ అనే టైటిల్ ఖరారు కూడా చేశారు. ఈ రకంగా మొదటి సినిమా విడుదల కాలేకపోయినా.. పవన్ కళ్యాణ్‌తో ‘బద్రి’ సినిమాతో మొదటిసారిగా సిల్వర్ స్క్రీన్ పై దర్శకుడిగా తన పేరును చూసుకున్నారు
ఇక సూపర్ స్టార్ కృష్ణతో సినిమా విడుదల కాకపోయినా.. ఆయన తనయుడు మహేష్ బాబుకు మాత్రం ‘పోకిరి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఆ తర్వాత ‘బిజినెస్ మేన్’ వంటి డిఫరెంట్ మూవీ చేసారు.
సూపర్ స్టార్ కృష్ణతో ‘థిల్లాన’ రిలీజ్ కాకపోయినా.. మరో సినిమాను తెరకెక్కించారు. సుమన్ హీరోగా ‘పాండు’ అనే చిత్రాన్ని తీశారు. ఆ చిత్రం కూడా విడుదలకు నోచుకోలేదు. ఈ రకంగా పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ రెండు చిత్రాలు విడుదలకు నోచుకోకపోవడం విశేషం. ఆ తర్వాత పూరీ జగన్నాథ్.. పవన్ కళ్యాణ్ హీరోగా ‘బద్రి’ సినిమాతో మెగాఫోన్ పట్టుకున్నారు. అంతేకాదు ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలను రూపొందించారు.
James Bond Heroes: సిల్వర్ స్క్రీన్ పై జేమ్స్ బాండ్‌గా ఇరగదీసిన హీరోలు వీళ్లే..
మొత్తంగా కెరీర్‌లో ఎన్నో అప్స్ డౌన్స్ చూసిన పూరీ జగన్నాథ్.. 2020లో రామ్ తో చేసిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మరోసారి దర్శకుడిగా సత్తా చాటారు.ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో నట సింహా బాలకృష్ణ కూడా సడెన్ విజిత్ చేసిన చిత్ర యూనిట్‌ను సర్‌ఫ్రైజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో మాస్టర్ ఆఫ్ రింగ్‌గా పేరు గాంచిన మైక్ టైసన్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు.
Ranbir Kapoor - Alia Bhatt : రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారా.. ?
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. అందుకే కథ రీత్యా ఈ సినిమాలో మైక్ టైసన్ ఓ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మైక్ టైసన్.. విజయ్ దేవరకొండ గురువు పాత్రలో కనిపించబోతున్నారా.. లేకపోతే.. ఆయనతో ఫైట్ చేసే విలన్‌గా యాక్ట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మైక్ టైసన్ రాకతో ‘లైగర్’ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Pawan kalyan, Puri Jagannadh, Suman, Super Star Krishna, Tollywood