HOME »NEWS »MOVIE »pawan kalyan praises ram charan and allu arjun sr

Allu Arjun-Ram Charan : అల్లు అర్జున్ రామ్ చరణ్‌లను మెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. పెద్ద మనుసు మీది..

Allu Arjun-Ram Charan : అల్లు అర్జున్ రామ్ చరణ్‌లను మెచ్చుకున్న పవన్ కళ్యాణ్.. పెద్ద మనుసు మీది..
అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ Photo : Twitter

Pawan Kalyan : నటుడు జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల ఏర్పాట్ల‌ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

  • Share this:
    నటుడు జనసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల ఏర్పాట్ల‌ నేపథ్యంలో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ముగ్గురు అభిమానులు క‌రెంట్ షాక్‌ గురై అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన పవన్ అభిమానులతో పాటు ఇతర స్టార్స్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. దీంతో ఈ ఘటనపై పవన్ కళ్యాణ్‌, రామ్ చరణ్‌, వకీల్ సాబ్ టీమ్ ఇప్పటికే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జనసేన తరుపున చనిపోయిన వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించగా.. వకీల్ సాబ్ టీమ్ తరుపున నిర్మాతలు కూడా మరో రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఇదే బాటలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతున్న మైత్రి మూవీ మేకర్స్ సైతం ఒక్కో కుటుంబానికి 2 లక్షలు ప్రకటించింది. ఇక ఫ్లెక్సీ కడుతూ విద్యుత్ షాక్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నలుగురికి రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తన వంతుగా సాయం చెయ్యడానికి ముందుకొచ్చి ఆర్ధికంగా ఆడుకుంటానని హామీ ఇచ్చాడు.


    అందులో భాగంగా అల్లు అర్జున్ చనిపోయిన వారి కుటుంబాలకు 2 లక్షలు చొప్పున ఆర్ధిక సాయం అందిస్తాని తెలిపాడు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తన వంతుగా తలో 2.5 లక్షలను ఆర్థిక సాయం చేస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ క్రమంలో మృతుల కుటుంబాలకు సాయం అందించిన వారికి పవన్ కళ్యా‌ణ్ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. 'కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి, అలాగే పెద్దమనసుతో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి, నిర్మాతలు- శ్రీ దిల్ రాజు, శ్రీ ఏఎమ్ రత్నం, మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు నా కృతజ్ఞతలు' అని పవన్ ట్వీట్ చేశారు.
    Published by:Suresh Rachamalla
    First published:September 03, 2020, 10:27 IST

    टॉप स्टोरीज