హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan | Major : మేజర్‌కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. అడివి శేష్ భావోద్వేగం..

Pawan Kalyan | Major : మేజర్‌కు పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. అడివి శేష్ భావోద్వేగం..

Pawan Kalyan and Adivi sesh Photo : Twitter

Pawan Kalyan and Adivi sesh Photo : Twitter

Pawan Kalyan | Major : ఈ సినిమాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో నటించిన అడివి శేష్‌ను (Adivi Sesh) మెచ్చుకున్నారు. అలాగే నటుడు మహేష్ బాబు(Mahesh Babu)కు అభినందనలు తెలిపారు.

  Pawan Kalyan | Major :  అడివి శేష్ (Adivi Sesh)టైటిల్ రోల్ ప్లే చేస్తూ నటించిన సినిమా ‘మేజర్’. ఎపుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటు ఇండియాతో పాటు ఈ సినిమా అమెరికాలో భారీగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమాలో నటించిన అడివి శేష్‌ను (Adivi Sesh) మెచ్చుకున్నారు. అలాగే నటుడు మహేష్ బాబు(Mahesh Babu)కు అభినందనలు తెలిపారు. అంతేకాదు సినిమాలో నటించిన ప్రకాష్ రాజ్‌కు, నటి రేవతికి పవన్ కళ్యాణ్ తన లెటర్‌లో అభినందనలు తెలిపారు. ఇక ఈ లెటర్‌కు స్పందించిన మహేష్ బాబు థాంక్యూ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు ఈ సినిమాలో హీరోగా చేసిన అడివి శేష్ కూడా పవన్ లేఖపై స్పందిస్తూ ఎమోషనల్ అయ్యారు. డియర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నా గుండె నిండుగా ఉంది. మీరు టూర్ బిజీ ఉండే సరికి చూసే టైమ్ ఉందా అని అనుకున్నా, మీ నోట్ నా హృదయలోతులను తాకింది. మీకు నేను ఇంకా ఎన్నో చెప్పాలి. నేను వాటిని ఫోన్‌లో చెబుతాను అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇదే కోవలో మరో నటుడు అల్లు అర్జున్ మేజర్ టీమ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

  ఇక మేజర్ విషయానికి వస్తే.. ఈ సినిమా అమెరికాలో దాదాపు 600 స్క్రీన్స్‌తో 325 లోకేషన్స్‌లో విడుదలైంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర మేజర్ మొదటి వారాన్ని పూర్తీ చేసుకుని అదరగొడుతోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 9వ రోజు 58 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్ గా 1.13 కోట్ల షేర్‌ని అందుకుంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగంలోకి దిగి ఏకంగా 8.76 కోట్ల రేంజ్‌లో ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది.

  ఇక మరోవైపు మేజర్ టీమ్ సినిమా టిక్కెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. టిక్కెట్ల రేట్లు రెండు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన నేపథ్యంలో స్టార్స్ సినిమాలకు కూడా మొదటి రోజే థియేటర్స్ ఖాలీగా ఉంటున్నాయి. పూర్తిగా నిండడం లేదు. ఈ నేపథ్యంలో మేజర్ టీమ్ టిక్కెట్ల ధరను (Major ticket prices) తగ్గిస్తూ ఓ ప్రకటన చేసింది. తెలంగాణలో సింగిల్ స్క్రీన్ 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయల ధరలను ఫిక్స్ చేశారు. అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 147 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి, 177 రూపాయలు మల్టీప్లెక్స్‌కు ఖరారు చేశారు.

  Major Movie Cross 1 Million US Dollar in America And Its IMDB Ratings And 6 Days Collections Details,Major : యూస్ బాక్సాఫీస్ దగ్గర ’మేజర్’ మూవీ మరో మైలురాయి. అడివి శేష్ కెరీర్‌లో తొలిసారి..,Major 6 Days Box Office Collections,Major Cross 1 Million Dollars,Major 5 Days Collections,Major,Major Movie first collections, Adivi Sesh Major Movie streaming partner confirmed, Major movie massive release in USA, Major ticket prices, adivi sesh major movie special show for pawan kalyan, Oh Isha from Adivi Sesh, Saiee M Manjrekar Major released, Major Telugu Trailer released, Adivi Sesh news, Adivi Sesh movies, Sobhita Dhulipala, Saiee Manjrekar. Mahesh Babu , Sashi Kiran,మేజర్ మూవీ కలెక్షన్స్,మేజర్ మూవీ 6 డేస్ కలెక్షన్స్,మేజర్ మూవీ,యూఎస్‌లో 1 మిలియన్ డాలర్ కలెక్ట్ చేసిన మేజర్ మూవీ
  మేజర్ మూవీ (Photo Twitter)

  ఈ సినిమా ఓటీటీ విషయంలో అప్పుడే ఓ క్లారిటీ వచ్చింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మేజర్ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళం భాషాల్లో నెట్‌ఫ్లిక్స్‌లో థియేటర్‌‌లోకి వచ్చిన 50 రోజులకు అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు. శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించగా.. శోబిత ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.

  Adivi Sesh Major Movie 5 Days World Wide Box Office Collections,Major 5 Days WW Collections : 5వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర కుమ్మేసిన అడివి శేష్ ‘మేజర్’..,Major 5 Days Box Office Collections,Major 5 Days Collections,Major,Major Movie first collections, Adivi Sesh Major Movie streaming partner confirmed, Major movie massive release in USA, Major ticket prices, adivi sesh major movie special show for pawan kalyan, Oh Isha from Adivi Sesh, Saiee M Manjrekar Major released, Major Telugu Trailer released, Adivi Sesh news, Adivi Sesh movies, Sobhita Dhulipala, Saiee Manjrekar. Mahesh Babu , Sashi Kiran,మేజర్ మూవీ కలెక్షన్స్,మేజర్ మూవీ 5 డేస్ కలెక్షన్స్,మేజర్ మూవీ
  అడివి శేష్ ‘మేజర్’  (Twitter/Photo)

  ఇక ఈ సినిమాలో 26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Major Sandeep Unnikrishnan) జీవితాన్ని చూపించారు. అందుకు తగ్గట్టుగానే ట్రైలర్‌లో ఎమోషన్స్‌తో పాటు అదిరే యాక్షన్ సీక్వెన్సెస్‌ను పొందుపరిచారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా‌తో పాటు GMB ఎంటర్‌టైన్‌మెంట్, A+S మూవీస్ పతాకాలపై సంయుక్తం నిర్మించారు. ‘మేజర్’ సినిమాను 120 పని దినాల్లో షూటింగ్ కంప్లీట్ చేసారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోటల్ సెట్ సహా 8 సెట్లు వేసారు.

  Major Movie Photo : Twitter

  మేజర్ తర్వాత అడవి శేష్ హిట్ సినిమా సీక్వెల్‌లో నటిస్తున్నారు. మొదటి హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటించగా... సీక్వెల్‌లో శేష్ నటిస్తున్నారు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం ‘హిట్’. ‘ది ఫస్ట్ కేస్’ అనే ట్యాగ్ లైన్‌తో కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్‌ పాత్రలో అడవి శేష్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Major Movie, Tollywood news

  ఉత్తమ కథలు