news18-telugu
Updated: August 8, 2020, 6:58 AM IST
పవన్ కల్యాణ్ హరీష్ శంకర్ ఫైల్ ఫోటో
రాజకీయాల్లో పూర్తిగా బిజీగా అయిన పవన్ కళ్యాణ్.. సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఈ లోగా పలు చిత్రాలు చేసి జనసేన పార్టీ కోసం నాలుగు రాళ్లు వెనకేసుకోెవాలనే ఆలోచనలో వరుస సినిమాలకు కమిట్ అయ్యాడు.ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ సినిమాను చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస్య దీక్ష నేపథ్యంలో డిసెంబర్లో కానీ ఈ సినిమా మిగిలిన పార్ట్ కంప్లీట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆ సినిమా తర్వాత క్రిష్‌తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేయనున్నాడు. జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ టైటిల్ అనుకున్నారు. ఈ సినిమాకు మాస్ అప్పీల్ లేదనే ఉద్దేశ్యంతో ’గజ దొంగ’తో పాటు ‘బందిపోటు’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. క్రిష్ సినిమా తర్వాత హరీష్ శంకర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా ఉండనుంది.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Twitter/Photo)
ఐతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మరోసారి పోలీస్ గెటప్‌లో కనిపించనున్నడానే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఐతే.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌ను కథ వినిపించి ఓకే చేయించుకున్నాడు హరీష్ శంకర్. అంతేకాదు ఈ సినిమాలో డైలాగ్స్, సన్నివేశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను తీర్చిదిద్దినట్టు సమాచారం. మొత్తంగా తన నిజ జీవిత పాత్రను తెరపై చేయనున్నడన్న మాట. అంతేకాదు ఇక ముందు తనను సంప్రదించే దర్శకులు పొలిటికల్ టచ్ ఉన్న కథతో రావాలని చెప్పినట్టు సమాచారం. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వచ్చే యేడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ‘ఇపుడే మొదలైంది’ అనే టైటిల్ అనుకుంటున్నారు. .
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 8, 2020, 6:58 AM IST