news18-telugu
Updated: November 13, 2019, 7:13 AM IST
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్
జనసేన అధినేతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. ఒకేసారి సినిమాలు, రాజకీయాలనే రెండు పడవలపై ప్రయాణం తనవల్ల కాదన్నాడు. కానీనీ మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని మళ్లీ నటనపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటికే హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. చేస్తా అని చెప్పాడు కానీ.. ఈ సినిమా ఎపుడు పట్టాలెక్కాలనేది ఇంకా తేలలేదు. ఇప్పటికే ఏపీలో ఇసుక పై పవన్ కళ్యాణ్.. ప్రభుత్వంలో పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. ఇవన్నీ అయ్యేసరికి ఎంత లేదన్నా.. ఆరేడు నెలల సమయంల పట్టవచ్చు. ఆ తర్వాత ‘పింక్’ సినిమాను స్టార్ట్ చేయవచ్చు. ఐతే.. ఈ సినిమా విషయమై నిర్మాతలు బోనీ కపూర్, దిల్ రాజు చేసిన ప్రకటనలపై పవన్ కళ్యాణ్ కాస్త సీరియస్ అయినట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా కోసం రూ.50 కోట్ల పారితోషకం తీసుకుంటున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్.. కేవలం 20 రోజుల కాల్షీట్స్ కేటాయించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాను ఎంసీఏ ఫేమ్ శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో పవన్ సరసన నయనతారను అనుకుంటున్నారు. మరో ముఖ్యపాత్రలో పూజా హెగ్డే లేదా తమన్నాను అనుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ (Instagram/Photo)
మరోవైపు పవన్ కళ్యాణ్.. కొన్నేళ్ల క్రితం తన దర్శకత్వంలో ఆగిపోయిన ‘సత్యాగ్రాహి’ సినిమాను దుమ్ము దులిపే పనిలో ఉన్నాడు. ఈ సినిమాను క్రిష్ లేదా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమాను కూడా కేవలం నెల ర ోజుల్లోనే కంప్లీట్ చేేయాలని చూస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఏపీలో ఎలక్షన్స్‌కు ఇంకా నాల్గునరేళ్లు ఉండటంతో రాజకీయల్లో కొనసాగుతూనే.. ఈ లోగా ప్రజలను మేలుకొలుపే సినిమాలు చేయాలని పవన్ కళ్యాణ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. .
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 13, 2019, 7:13 AM IST