పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకు టైటిల్ సహా అంతా సిద్దం.. పట్టాలెక్కేది ఎపుడంటే..

పవన్ కల్యాణ్ పింక్ రీమేక్

ఇప్పటికే ఫవన్ కళ్యాణ్ హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. ఈ సినిమాను పవన్ కళ్యాణ్...

 • Share this:
  జనసేన అధినేతగా పూర్తిస్థాయి రాజకీయాల్లో వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. ఒకేసారి సినిమాలు, రాజకీయాలనే రెండు పడవలపై ప్రయాణం తనవల్ల కాదని జనసేనానిగా పవన్ కళ్యాణ్ ఎన్నో సార్లు చెప్పాడు. కానీ ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని మళ్లీ నటనపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఇప్పటికే ఫవన్ కళ్యాణ్ హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి ఓకే చెప్పాడు. చేస్తా అని చెప్పాడు కానీ.. ఈ సినిమా ఎపుడు పట్టాలెక్కాలనేది ఇంకా తేలలేదు.ముందుగా ఈ సినిమాను వచ్చే యేడాది స్టార్ట్ చేయాలనకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ నిర్మాతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా సడెన్‌గా తన నిర్ణయాన్ని మార్చుకుని... వెంటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

  pooja hegde will play lead role in pawan kalyan pink telugu remake,pooja hegde,pawan kalyan,pink,pink telugu remake,pawa kalyan nayanthara,nayanthara,pawan kalyan trivikram,pawan kalyan pin telugu remake,pooja hegde pawan kalyan,pink pooja hegde pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan instagram,pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde facebook,pooja hegde pawan kalyan trivkiram venu sriram,tollywood,telugu cinema,పూజా హెగ్డే,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్‌లో పూజా హగ్డే,పూజా హెగ్గే పింక్ రీమేక్,వేణు శ్రీరామ్, దిల్ రాజు బోనీ కపూర్,నయనతార,పవన్ కళ్యాణ్ నయనతార
  ‘పింక్’ రీమేక్‌లో పవన్ కళ్యాణ్,పూజా హెగ్డే (Twitter/Photos)


  అంతేకాదు ఈ సినిమాను పవన్ కళ్యాణ్.. డిసెంబర్‌ రెండో వారంలో  స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో భారీ కోర్టు సెట్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి.డిసెంబర్ రెండో వారం నుంచి షూటింగ్ మొదలుపెట్టి కేవలం 50 పనిదినాల్లో ఈ సినిమా షూటింగ్‌లో రికార్డు టైమ్‌లో  పూర్తి చేయాలన్న పట్టుదలతో నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌ ఉన్నారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ..కేవలం 45 రోజులు మాత్రమే కేటాయించినట్టు సమాచారం. అంతేకాదు 2020 మేలో ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడైన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు రాయడం విశేషం.  ఈ సినిమాకు ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ ఖరారు చేసారు. ‘పింక్’ హిందీ వెర్షన్‌లో తాప్సీ చేసిన పాత్రలో పూజా హెగ్డే నటిస్తోంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో నయనతానను అనుకుంటున్నారు. తమిళంలో ఈ సినిమాను అజిత్ హీరోగా ‘నేర్కొండ పార్వాయి’గా రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్టైయింది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: