PAWAN KALYAN NOT INTERESTED TO ACT BOLLYWOOD SUPER HIT PINK TELUGU REMAKE HERE ARE THE DETAILS TA
రీ ఎంట్రీ విషయమై పవన్ కళ్యాణ్ యూటర్న్..
పవన్ కళ్యాణ్(ఫేస్బుక్ ఫోటో)
పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాడు. తాజాగా పవన్ కళ్యాణ్.. తన రీ ఎంట్రీ విషయమై యూ టర్న్ తీసుకున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల నుంచి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే కేటాయించాడు. అంతేకాదు సినిమాలు చేయనని ఖరాఖండిగా ఎన్నోసార్లు చెప్పాడు. కానీ ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. మళ్లీ ముఖానికి రంగేసుకొని నటనపై దృష్టి కేంద్రీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్‌లో నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పింక్‌లో అమితాబ్ బచ్చన్ లాయర్ పాత్రను పోషించాడు. అదే లాయర్ పాత్రను తెలుగు రీమేక్‌లో పవన్ కళ్యాణ్ చేయనున్నాడు. ఇక ఈ సినిమాను ఈ నెలలోనే ప్రారంభినుంచి 40 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేసి సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. బోనీ కపూర్, దిల్ రాజు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేయనున్నాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయమై నిర్మాతలకు బిగ్ షాక్ ఇచ్చాడట.
పవన్ కల్యాణ్ పింక్ రీమేక్
ఇప్పటికే తన రీ ఎంట్రీ విషయమై మీడియాకు లీకులు ఇచ్చిన దిల్ రాజు, బోనీ కపూర్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి. ఆ సంగతి పక్కనపెడితే..ఇప్పటికే హిందీలో, తమిళంలో ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దాదాపు తెలుగులో చాలా మంది ఆడియన్స్‌కు ఈ సినిమా స్టోరీ తెలుసు. కాబట్టి.. తెలిసిన కథతో కాకుండా కొత్త కథతో తన దగ్గరకి రమ్మని దిల్ రాజుకు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే డైరెక్టర్ ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ, స్క్రీన్ ప్లే కూడా రెడీ చేసుకున్నాడు. అంతేకాదు ఇప్పటికే ఈసినిమా కోసం ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ కూడా ఖరారు చేసాడు.