పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదు సినిమాలకు ఓకే చెప్పారు. ఇందులో వకీల్‌సాబ్ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తదుపరి పవన్ చేయబోయే సినిమాపై ఎవరికీ క్లారిటీ లేదు. ఎందుకంటే పవన్ అన్నీ సినిమాలను లైన్లో పెట్టుంచాడు. వరుస ప్రకారం చెప్పాలంటే క్రిష్ జాగర్లమూడి సినిమా సెట్స్‌పైకి వెళ్లాలి కానీ పవన్ మరో సినిమాను లైన్లోకి ముందుగా తెచ్చాడట. ఆ సినిమా ఏదో కాదు.. మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోశియుమ్. రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఇద్దరు హీరోలుంటారు. ఓ హీరోగా పవన్ నటిస్తుంటే.. మరో హీరో పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నారు. నిజానికి పవన్ ప్రకటించిన సినిమాల లిస్టులో ఈ సినిమానే ఆఖరు. కానీ ఇది లైన్లో ముందుకొచ్చింది.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రాన్ని సోమవారం లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారట. జనవరి 2 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందట. దాదాపు నెలరోజుల కాల్షీట్ మాత్రమే కేటాయించాడట పవన్. ఈ సినిమాను త్రివిక్రమ్ ముందుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించడంతో పవన్ కూడా సినిమాను ముందుగా పూర్తి చేయడానికి ఓకే అన్నాడట. పవన్ ఇమేజ్, తెలుగు నెటివిటీకి తగ్గట్లు కథలో చాలా మార్పులు, చేర్పులు చేశారు. ఇందులో పవన్ సరసన సాయిపల్లవి హీరోయిన్గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. పవన్ పాత్ర ఎలివేషన్ రేంజ్ ఎక్కువగా ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది పూర్తి కాగానే క్రిష్ సినిమా లైన్ ఉంది. దీంతో పాటు హరీశ్ శంకర్-మైత్రీ మూవీస్ కాంబినేషన్లో సినిమా ఉంది. సురేందర్ రెడ్డి-ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్ రామ్ తాళ్లూరి సినిమా కూడా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇది కాకుండా బండ్లగణేశ్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేయడానికి రెడీ అయినట్లు సాక్షాత్తు బండ్ల గణేశ్ తెలియజేశాడు. ఒకవైపు రాజకీయాలు, మరో వైపు సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మరి ఏ సినిమాను ఎప్పుడు ఎలా పూర్తి చేస్తాడో ఆయనకే తెలియాలి.