పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వకీల్ సాబ్‌కు కరోనా..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు వకీల్ సాబ్ సినిమా వస్తుందా అని వేచి చూస్తున్నారు. రెండేళ్లకు పైగానే అయిపోయింది పవన్‌ను..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 18, 2020, 2:30 PM IST
పవన్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. వకీల్ సాబ్‌కు కరోనా..
వకీల్ సాబ్‌గా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ (Twitter/Photo)
  • Share this:
పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడు వకీల్ సాబ్ సినిమా వస్తుందా అని వేచి చూస్తున్నారు. రెండేళ్లకు పైగానే అయిపోయింది పవన్‌ను వెండితెరపై చూసి. దాంతో ఆయన ఫ్యాన్స్‌తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇంకా రెండు నెలలు.. ఇంకా నెల రోజులు అంటూ రోజులు కూడా లెక్క పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు కరోనా కారణంగా పవన్ సినిమా కూడా వాయిదా పడేలా కనిపిస్తుంది. వకీల్ సాబ్‌ విడుదలకు కూడా కరోనా సోకేలా కనిపిస్తుంది.

క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ (Twitter/Photo)
క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ (Twitter/Photo)


మే 15న ఈ సినిమా విడుదలవుతుందని నిర్మాత దిల్ రాజు కన్ఫర్మ్ చేసాడు. అయితే ఇప్పుడు ఈ తేదీ జూన్‌కు వెళ్తుందని ప్రచారం జరుగుతుంది. పవన్ సినిమా అనుకున్న దానికంటే వేగంగానే షూటింగ్ పూర్తయింది. అయితే ఇంకా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మిగిలిపోయిన సమయంలో కరోనా వైరస్ వచ్చేసింది. దాంతో కొన్ని రోజుల పాటు షూట్ వాయిదా వేసారు. దాంతో ఆటోమేటిక్‌గా విడుదల తేదీపై కూడా ప్రభావం పడేలా కనిపిస్తుంది. ఇప్పటికే దిల్ రాజు తాను నిర్మించిన నాని 25వ సినిమా వి..ను కూడా పోస్ట్ పోన్ చేసాడు.

PSPK26 పోస్టర్ Photo : Twitter
PSPK26 పోస్టర్ Photo : Twitter


మార్చ్ 25న ఉగాది కానుకగా రావాల్సిన ఈ చిత్రం ఎప్రిల్‌కు వెళ్లిపోయింది. ఇప్పుడు మేలో రావాల్సిన వకీల్ సాబ్ కూడా జూన్‌కు వెళ్లిపోయేలా కనిపిస్తుంది. దాంతో పాటు మిగిలిన కొన్ని సినిమాలు కూడా అనుకున్న సమయానికి రావడం లేదు. రిలీజ్ వాయిదా పడిందనే విషయం తెలిసి అభిమానులు కూడా బాగా ఫీల్ అవుతున్నారు. పింక్ సినిమా రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. దాంతో పాటు క్రిష్ సినిమాలో కూడా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్.
First published: March 18, 2020, 2:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading