పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా వస్తున్న మరో కొత్త సినిమా హరి హర వీర మల్లు. క్రిష్ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శ్రీరామ నవమి సందర్భంగా ఇవాళ హరి హర వీర మల్లు( (Hari Hara Veera Mallu New Poster) కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్లో పవన్ పదునైన చూపులతో.. చేతిలో ఈటెతో మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నారు. దీంతో పవన్ కొత్త పోస్టర్ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పవన్ ఫ్యాన్స్ లైకులు కామెంట్లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
Let’s celebrate the symbol of chivalry & virtue on this auspicious day of #SriRamaNavami by adherence to truth and Dharma ? - Team #HariHaraVeeraMallu @PawanKalyan @DirKrish @AgerwalNidhhi @mmkeeravaani @AMRathnamOfl @ADayakarRao2 @gnanashekarvs @saimadhav_burra #ThotaTharani pic.twitter.com/7cA4px6frw
— Hari Hara Veera Mallu (@HHVMFilm) April 10, 2022
ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతొంది. దీంతో ఇవాళ శ్రీరామ నవమి సందర్భంగా హరి హర వీర మల్లు లోకేషన్లో పూజ నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా... షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు లొకేషన్ లో పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏయం రత్నం సీతారాములకు భక్తి శ్రద్ధలతో పూజ చేశారు.
ఇక హరి హర వీర మల్లు సినిమా విషయానికి వస్తే.. గోల్కోండ, నవాబులు, వజ్రాలు అంటూ ఇది వరకు ఎన్నడూ చూడని, టచ్ చేయని కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోంది. దర్శకుడు క్రిష్ (Krish) ఈ ప్రాజెక్ట్ కోసం బాగానే రీసెర్చ్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన సినిమా టీజర్, పోస్టర్లు నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి. మరోవైపు తోట తరణి కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. హరి హర వీర మల్లు కోసం భారీ ఎత్తున సెట్స్ వర్క్ జరుగుతున్నాయి.
ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అగ్ర నిర్మాత ఎ.ఎం.రత్నం(M.M.Ratnam) సమర్పణలో.. ఎ.దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ అండ్ ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరయిన్గా నటిస్తోంది. పంచమి క్యారక్టర్లో నిధి అగర్వాల్ నటిస్తున్నట్లు ఇప్పటికే పోస్టర్ కూడా రిలీజ్ అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.