తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌ది సెపరేట్ స్టైల్ అని చెప్పాలి. దర్శకుడిగా పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘బద్రి’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ మొదలు పెట్టాడు. ఆ తర్వాత చాలా ఏళ్లకు వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల మధ్యలో వీళ్లిద్దిరి మధ్య మరో మూడు సినిమాలు తెరకెక్కిల్సింది. కానీ ఆ మూడు చిత్రాలను పూరీ జగన్నాథ్..వేరే హీరోలతో తెరకెక్కించి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాల విషయానికొస్తే.. ముందుగా ఇడియట్ కథను పూరీ జగన్నాథ్... పవన్ కళ్యాణ్‌ను దృష్టిలో పెట్టుకొని రాసారట. ఆ తర్వాత ఆయనను కలిసి వినిపించాడు కూడా. కథ విన్నంత సేపు ఈ స్టోరీని పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేసినట్టు పూరీ జగన్నాథ్.. ఆలీ తో జాలీగా టాక్ షోలో చెప్పారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ స్టోరీ ఓకే చేయలేదు. ఆ తర్వాత ఇడియట్ కథను రవితేజతో తెరకెక్కించాడు. ఈ సినిమా హీరోగా రవితేజ కెరీర్‌ను ఛేంజ్ చేసింది. ఆ తర్వాత ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ కూడా పవన్ కళ్యాణ్ కోసమే రాసిందట. కానీ ఈ చిత్రాన్ని కూడా పవర్ స్టార్ ఓకే చేయలేదు. ఆ తర్వాత మహేష్ బాబుకు సూపర్ స్టార్ హోదాను దక్కించిన పోకిరి సినిమాను కూడా ముందు హీరోగా పవన్ కళ్యాణ్‌ను అనుకున్నాడు. ఈ రకంగా పవన్ కళ్యాణ్ కోసం అనుకున్న స్టోరీలు వేరే హీరోలకు స్టార్ డమ్ తీసుకొచ్చాయి.
దర్శకుడిగా పూరీ జగన్నాథ్‌కు మొదటి చిత్రం బద్రి కాదు. అంతకు ముందు ఆయన రెండు సినిమాలను తెరకెక్కించాడు. మొదట కృష్ణతో ‘థిల్లాన’ సినిమా తెరకెక్కించాడు. కానీ ఈసినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ తర్వాత సుమన్‌తో ‘పాండు’ సినిమాను తెరకెక్కిండు. ఈ సినిమా కూడా ఎందుకో రిలీజ్ కాలేదు. కానీ ముచ్చటగా మూడోసారి పవన్ కళ్యాణ్‌తో చేసిని ‘బద్రి’ సినిమాతో డైరెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి దర్శకుడిగా తన సత్తా ఏంటో చూపించాడు. త్వరలో పూరీ జగన్నాథ్.. పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mahesh babu, Pawan kalyan, Puri Jagannadh, Ravi Teja, Telugu Cinema, Tollywood