Pawan Kalyan : ’హరిహర వీరమల్లు’ దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీ..

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ (Twitter/Photo)

Pawan Kalyan :  ’హరి హర వీరమల్లు’ దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం.. చిత్ర హీరో పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. అంతేకాదు త్వరలో మొదలు కానున్న షెడ్యూల్ కోసం వీళ్లిద్దరు పవర్ స్టార్ కలవడం జరిగింది. 

  • Share this:
    Pawan Kalyan :  ’హరి హర వీరమల్లు’ దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎం రత్నం.. చిత్ర హీరో పవన్ కళ్యాణ్‌తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. అంతేకాదు త్వరలో మొదలు కానున్న షెడ్యూల్ కోసం వీళ్లిద్దరు పవర్ స్టార్ కలవడం జరిగింది.  దానికి సంబంధించి ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. ఈ యేడాది ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. త్వరలో‘భీమ్లా నాయక్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘భీమ్లా నాయక్’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక ‘భీమ్లా నాయక్’ కంటే ముందు  ముందు పవన్ కళ్యాణ్ షురు చేసిన   ‘హరి హర వీరమల్లు’ సినిమా మాత్రం కాస్త ఆలస్యంగా మళ్లీ ఈ సినిమా షూటింగ్  పట్టాలెక్కనుంది.

    పవన్ కళ్యాణ్  తన కెరీర్‌లో తొలిసారి చారిత్రక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మొఘలాయి రాజులను  ఎదిరించిన ’హరి హర వీరమల్లు’ ప్రతాపం తెరపై ఎలా ఉండబోతుందో అని కామన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    Pawan Kalyan AM Rathnam Krish Hari Hara Veera Mallu News18
    పవన్ కళ్యాణ్‌తో క్రిష్,ఏ.ఎం.రత్నం ప్రత్యేక భేటి (Twitter/Photo)


    ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా షూటింగ్ చేస్తున్నారు. దాంతో పాటు త్వరలో ‘హరి హర వీర మల్లు’ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. దానికి సంబంధించి షూటింగ్  వివరాలను పవన్ కళ్యాణ్‌ను  వివరించడానికి దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ.ఎం.రత్నం కలిసి వచ్చారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెట్టనున్నారు.

    Tollywood Family Multistarers: టాలీవుడ్ ఫ్యామిలీ మల్టీస్టారర్స్.. మెగా, నందమూరి ఫ్యామిలీ నుంచి అక్కినేని, దగ్గుబాటి వరకు..

    ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నారు. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. ఇక రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ ఇందులో కీలక పాత్రలో నటించనుంది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు.

    pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan instagram,pawan kalyan hari hara veeramallu movie,pawan kalyan hari hara veeramallu movie shooting delay,pawan kalyan hari hara veeramallu movie kirsh delay,pawan kalyan hari hara veeramallu movie release date,telugu cinema,పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు,పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్,పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు విడుదల ఆలస్యం
    పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు (Pawan Kalyan Hari Hara Veeramallu)


    ముందుగా ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తీరా అదే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ మరో మూవీ ‘భీమ్లా నాయక్’ రానుంది. అయితే ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్‌ను పరిచయం చేసాము. ఇదే టైటిల్ ఫైనల్ కాదని చెబుతున్నారు. ఈ సినిమాలో రానా పాత్రను పరిచయం చేసిన తర్వాత మరో పేరు ప్రకటిస్తామని చెప్పారు.

    Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..

    కానీ ఇప్పటికే మాస్‌లో ‘భీమ్లా నాయక్’ టైటిల్ వెళ్లిపోయింది. నిర్మాతలు భీమ్లా నాయక్ కాకుండా మరో పేరు పెడతారనేది చూడాలి. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని వచ్చే యేడాది 29 ఏప్రిల్ 2022న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తంగా ఏ.ఎం.రత్నం, క్రిష్ పవన్ కళ్యాణ్‌తో భేటి కావడం ఇపుడు ప్రాధాన్యత సంతరించుకుంది
    Published by:Kiran Kumar Thanjavur
    First published: