పవన్ కళ్యాణ్‌ వైపు చూస్తోన్న చిరంజీవి.. అటువైపుగా ప్రయత్నాలు షురూ..

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: April 7, 2020, 6:35 AM IST
పవన్ కళ్యాణ్‌ వైపు చూస్తోన్న చిరంజీవి.. అటువైపుగా ప్రయత్నాలు షురూ..
చిరంజీవి, పవన్ కళ్యాణ్ Photo : Twitter
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తన 152వ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే 50శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా కరోనా వైరస్ కారణంగా ఆచార్య షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది. కరోనా ప్రభావం కొంత తగ్గిన తర్వాత మే నుండి ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుందని సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తాడని ఓ ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూ లో స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మొదటినుండి ఈ మూవీలోని ఓ పాత్ర కోసం కొరటాల చరణ్ నే అనుకుంటున్నారు. ఈ చిత్రం కోసం మహేష్ ని అసలు అనుకోలేదని స్పష్టం చేశాడు. అయితే ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చరణ్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆచార్య కోసం చరణ్ డేట్స్ కావాలంటే రాజమౌళి ఒప్పుకోవాలి. ఇది కుదరాలంటే కొరటాల శివ, రాజమౌళి కాంప్రమైజ్ అవ్వాలి.. అప్పుడే ఇది సాధ్యం అవుతుందని ఆయన పేర్కోన్నాడు. ఆచార్యలో చరణ్ పాత్ర దాదాపు అరగంట ఉంటుందట. మరి ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీ గా ఉన్న చరణ్ ఓ నెల రోజులు చిరు సినిమా కోసం డేట్స్ కేటాయించడం అనేది, కష్టమనే చెప్పాలి. ఇప్పటికే అనేక అవాంతరాలతో నడుస్తున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ నుండి చరణ్ వేరే మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రాజమౌళి అనుమతి ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది.

దీంతో ఒక వేళ చరణ్ నటించ లేకపోతే ఆ స్థానంలో పవన్ చేయడం కరెక్ట్‌గా ఉంటుందని భావిస్తోందట చిత్రబృందం. సోషల్ కాన్సెప్ట్ మీద సినిమా కావడంతో పాటు అన్న చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో పవన్ కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటాడని అనుకుంటున్నారట. ఆచార్య సినిమా కారణంగా ఒక వేళ ఇదే జరిగితే మెగా ఫ్యాన్స్ చిరకాల కోరిక తీరినట్టే. ఎందుకంటే చిరు, పవన్ కలిసి మల్టీ స్టారర్ చేయాలని ఎప్పటికి నుండో వాళ్ల ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. వారి కోరిక ఈ సినిమాతో సాధ్యం అయ్యే సూచనలు మెండుగానే ఉన్నాయనిపిస్తోంది. ఇక ఆచార్యలో ముందునుండి త్రిషను అనుకుంటే ఆమె ఏవో కారణాల వల్ల ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో కాజల్‌ను తీసుకుంది చిత్రబృందం. ఈ సినిమాను చరణ్, నిరంజన్ రెడ్డిలు కలిసి కొణిదెల ప్రోడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
First published: April 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading