ముచ్చటగా మూడోసారి ఆ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

పవన్ 26, 27, 28 సినిమాలకు సంబంధించిన కొత్త విషయాలను దర్శక నిర్మాతలు సెప్టెంబర్ 2నే అనౌన్స్ చేయబోతున్నారు. ముందుగా వకీల్ సాబ్ అప్‌డేట్ ఉదయం 9.09 నిమిషాలకు రాబోతుందని ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ ట్వీట్ చేసాడు.

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తనతో గతంలో రెండు సినిమాలు తెరకెక్కించిన ఓ దర్శకుడికి ముచ్చటగా మూడో ఛాన్స్ ఇచ్చినట్టు సమాచారం.

 • Share this:
  పవన్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతూనే వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ‘పింక్’ రీమేక్ ‘వకీల్‌సాబ్’ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం లాక్‌డౌన్ దృష్ట్యా ఈ సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడింది. కరోనా నేపథ్యంలో ఈ యేడాది చివర్లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌ జోడిగా ఇలియానా దాదాపు ఖరారైంది. ‘వకీల్‌సాబ్’ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ చేస్తున్నాడు.ఈ సినిమాను ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ‘విరూపాక్షి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. వాటితో పాటు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాకు ఓకే చెప్పాడు.  తాజాగా పవన్ కళ్యాణ్  హరీష్ శంకర్ సినిమా తర్వాత  డాలీ (కిషోర్ పార్థసాని) దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.

  pawan kalyan may act director kishore pardasani direction with remake of vikram vedha along with ravi teja,pawan kalyan, kishore pardasani dolly,pawan kalyan dolly kishore pardasani movie,pawan kalyan twitter,kishore pardasani twitter,dolly twitter,ravi teja,pawan kalyan ravi teja,pawan kalyan another remake,pawan kalyan vikram vedha remake with ravi teja,pawan kalyan ravi teja vikram vedha remake,pawan kalyan ravi teja bobby vikram vedha remake,vakeel saab movie,pawan kalyan remake pink telugu vakeel saab,vakaeel saab,power star pawan kalyan,pawan kalyan pink remake lawyer saab,pawan kalyan remake kahni,pawan kalyan remakes,pawan kalyan kritsh,tollywood,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్,పవన్ కళ్యాణ్ రీమేక్ కహాని,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లాయర్ సాబ్,లాయర్ సాబ్ మూవీ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,వకీల్ సాబ్,వకీల్ సాబ్ మూవీ,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ,పవన్ కళ్యాణ్ రవితేజ,పవన్ కళ్యాణ్ విక్రమ్ వేద రీమేక్,పవన్ కళ్యాణ్ రవితేజ విక్రమ్ వేద రీమేక్,డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్
  కిషోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (File/Photo)

  ఈ సినిమా తమిళంలో హిట్టైన ‘విక్రమ్ వేద’కు రీమేక్ అనే టాక్ నడుస్తోంది. తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి నటించిన ‘విక్రమ్ వేద’ను తెలుగుతో రవితేజతో కలిసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 2017లో పుష్కర్ గాయత్రి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో రీమేక్ అవుతుందని చాలా రోజులుగా వార్తలు వినిపించాయి. ముందుగా నాగార్జున, వెంకటేష్ ఈ రీమేక్ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత నాగార్జున, రానా అంటూ ఆపై వెంకటేష్, రానా, బాలకృష్ణ, రాజశేఖర్ ఈ రీమేక్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. రీసెంట్‌గా వరుణ్ తేజ్, రవితేజ కూడా ఈ సినిమా రీమేక్‌ చేయబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేసాయి. తాాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తెలుగులో డాలీ డైరెక్షన్‌లో రీమేక్  చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.  ఈ చిత్రాన్ని రవితేజతో నేల టిక్కెట్ చిత్రాన్ని నిర్మించిన రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నట్టు సమాచారం.

  కిషోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (File/Photo)

  పవన్ కళ్యాణ్.. 2024 ఎన్నికల లోపు ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలో కొత్త స్టోరీతో కుస్తీ పట్టడం కంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన కథ అయితే రిస్క్ ఉండదనే ఉద్దేశ్యంతో ఈ రీమేక్‌కు ఓకే చెప్పినట్టు సమాచారం.

  pawan kalyan may act director kishore pardasani direction with remake of vikram vedha along with ravi teja,pawan kalyan, kishore pardasani dolly,pawan kalyan dolly kishore pardasani movie,pawan kalyan twitter,kishore pardasani twitter,dolly twitter,ravi teja,pawan kalyan ravi teja,pawan kalyan another remake,pawan kalyan vikram vedha remake with ravi teja,pawan kalyan ravi teja vikram vedha remake,pawan kalyan ravi teja bobby vikram vedha remake,vakeel saab movie,pawan kalyan remake pink telugu vakeel saab,vakaeel saab,power star pawan kalyan,pawan kalyan pink remake lawyer saab,pawan kalyan remake kahni,pawan kalyan remakes,pawan kalyan kritsh,tollywood,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్,పవన్ కళ్యాణ్ రీమేక్ కహాని,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లాయర్ సాబ్,లాయర్ సాబ్ మూవీ,పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీ,వకీల్ సాబ్,వకీల్ సాబ్ మూవీ,పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ,పవన్ కళ్యాణ్ రవితేజ,పవన్ కళ్యాణ్ విక్రమ్ వేద రీమేక్,పవన్ కళ్యాణ్ రవితేజ విక్రమ్ వేద రీమేక్,డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్
  డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (File/Photo)

  ఇప్పటికే డాలీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్.. ‘గోపాల గోపాల’ సినిమాతో పాటు ‘కాటమరాయుడు’ సినిమాలు చేసాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచాయి. ఐనా తనకు రెండు ఫ్లాపులు ఇచ్చిన దర్శకుడికి మరోసారి పవన్ కళ్యాణ్ దర్శకుడిగా ఛాన్స్ ఇవ్వడం నిజంగానే గ్రేట్.
  Published by:Kiran Kumar Thanjavur
  First published: