హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Manchu Manoj : పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్ భేటి వెనక అసలు కథ అదేనా..

Pawan Kalyan - Manchu Manoj : పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్ భేటి వెనక అసలు కథ అదేనా..

పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్ భేటి (Twitter/Photo)

పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్ భేటి (Twitter/Photo)

Pawan Kalyan - Manchu Manoj : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్ భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

  Pawan Kalyan - Manchu Manoj : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మంచు మనోజ్ భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘మా’ ఎలక్షన్స్ నేపథ్యంలో మంచు ఫ్యామిలీకి మెగా కాంపౌండ్‌కు మధ్య దూరం పెరగడంతో పాటు ఈ సందర్భంగా మాటల యుద్దమే జరిగింది. మెగా ఫ్యామిలీ అండతో ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ప్రకాష్‌ రాజ్.. అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. ఆయనపై పోటీ చేసిన మంచు విష్ణు.. ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.  ఈ నేపథ్యంలో మంచు విష్ణు ప్యానల్ పై ప్రకాష్ రాజ్‌తో పాటు వాళ్ల ప్యానల్ సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ‘మా’ ఎన్నికల్లో మోహన్ బాబు, మంచు విష్ణు గుండాల్లా ప్రవర్తించి రిగ్గింగ్‌కు పాల్పడమే కాదు.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రాంతీయ వాదాన్ని తీసుకొచ్చారనే ఆవేదనతో ‘మా’ సభ్యత్వానికి మెగా బ్రదర్ నాగబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే కదా.

  మొత్తం సినీ ఇండస్ట్రీ రెండుగా చీలి ఉప్పు నిప్పుగా ఉన్న ఈ టైమ్‌లో  జనసేనాని పవన్ కల్యాణ్ తో మోహన్ బాబు తనయుడు ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు సోదరుడు సినీ నటుడు  మంచు మనోజ్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘భీమ్లా నాయక్’ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అక్కడకు వెళ్లి మంచు మనోజ్ పవన్ కళ్యాణ్‌ను కలిసారు.

  ఈ సందర్భంగా మంచు మనోజ్.. మాట్లాడుతూ.. పవర్ స్టార్‌ను కలవడం ఎంతో వపర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్ అని మనోజ్ ట్వీట్ చేశారు. అంతేకాదు పవన్ కళ్యాణ్‌ను ఎపుడు కలవడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనతో మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను హత్తుకున్న ఫోటోను పోస్ట్ చేశారు.

  Chiranjeevi - Mani Sharma: ఆచార్య సహా చిరంజీవి, మణిశర్మ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ఇవే..

  ఐతే.. పవన్ కళ్యాణ్‌ .. ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను మోహన్ బాబు.. ఖండించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా మంచు విష్ణు గెలిచిన తర్వాత తామిద్దరం నేరుగా వెళ్లకుండా.. చిన్నబ్బాయితో రాయబారం నడిపించినట్టు తెలుస్తోంది.

  Rajinikanth - Peddhanna : ‘పెద్దన్న’గా సూపర్ స్టార్ రజినీకాంత్.. అదిరిన ’అన్నాత్తే’ తెలుగు టైటిల్..

  ఈ సందర్బంగా మెగా క్యాంప్‌ను మచ్చిక చేసుకొని నాగబాబు.. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా ఉప సంహరణతో  పాటు మిగతా ప్యానల్ సభ్యులు తిరిగి విధుల్లో చేరేలా మోహన్ బాబు పాచిక వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే మోహన్ బాబు.. నందమూరి నట సింహా బాలకృష్ణ తన అబ్బాయి.. మంచు విష్ణుతో వెళ్లి కలవడం జరిగింది. ఈ సందర్భంగా అన్న బాల సపోర్ట్‌తో తాను ఎన్నికల్లో గెలిచినట్టు పేర్కొన్నారు.

  నందమూరి బాలకృష్ణతో తండ్రి మోహన్ బాబుతో కలిసి ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు భేటి

  ఇక మెగా క్యాంపులో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను నేరుగా కలవకుండా.. చిన్నబ్బాయితో రాయబారం నడిపి వారిని బుజ్జిగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తంగా ‘మా’ చీలిపోతే.. మొదటికే మోసం వస్తుందనే ఉద్దేశ్యంతో మోహన్ బాబు ఒక అడుగు ముందుకు వేసి మెగా ఫ్యామిలీతో రాజీ కుదుర్చుకునే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. మొత్తంగా మోహన్ బాబు.. తనకు తాను వెళ్లలేక.. మంచు మనోజ్‌తో ‘మా’ లోని లుకలుకలు సమసిపోయేలా చేస్తున్నట్టు అర్ధమవుతోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: MAA Elections, Manchu Manoj, Manchu Vishnu, Mohan Babu, Pawan kalyan, Tollywood

  ఉత్తమ కథలు