Pawan Kalyan - Mahesh Babu : ఆర్ఆర్ఆర్ రాకతో సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సర్కారు వారి పాట, భీమ్లా నాయక్ మూవీలు.. ?

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (File/Photo)

  • Share this:
    Pawan Kalyan - Mahesh Babu : ఆర్ఆర్ఆర్ (RRR) రాకతో సంక్రాంతి బరి నుంచి మహేష్ బాబుసర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాతో పాటు పవన్ కళ్యాణ్, రానాల ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) పోటీ నుంచి తప్పుకోనున్నాయా అంటే ఔననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ముందుగానే ఈ రెండు సినిమాలు తమ సినిమాలను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించాయి. తీరా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్‌ (Ram Charan)ల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను జనవరి 7వ తేదిని విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తమ సినిమాల విడుదల తేదిలను వాయిదా వేసుకోనున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే.. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ. ఈ సినిమాపై భారతీయసంక చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి.

    అబ్బాయి రామ్ చరణ్ సినిమా కావడంతో పవన్ కళ్యాణ్.. తన ‘భీమ్లా నాయక్’ సినిమాను శివరాత్రికి పోస్ట్ పోన్ చేయమని నిర్మాతలకు చెప్పినట్టు సమాచారం. ఒకేసారి బాబాయ్, అబ్బాయిల సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లాష్ కాకూడదనే ఉద్ధేశ్యంతో పవన్ కళ్యాణ్.. తన సినిమాను పోస్ట్ పోన్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. సంక్రాంతి హడావుడి ముగిసిన తర్వాత శివరాత్రికి సోలోగా వచ్చి బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించాలనే ఆలోచనలో ఉన్నారు. ‘భీమ్లా నాయక్’ కొత్త రిలీజ్ డేట్ పై నిర్మాతలు త్వరలో అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.

    Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..


    మరోవైపు మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా చేయనున్నారు. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో నెక్ట్స్ ప్యాన్ ఇండియా మూవీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రాజమౌళి.. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి ఈ సినిమా కథను ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారు. ‘ఇండియానా జోన్స్’ తరహాలో యాక్షన్ కథను మహేష్ బాబుతో తెరకెక్కించాలనే ప్లాన్‌లో ఉన్నారు రాజమౌళి.

    Nayanthara - Anushka: అనుష్క టూ నయనతార.. ఆ తరహా పాత్రలో ఇరగదీసిన భామలు..


    ఎలాగే రాజమౌళితో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇలాంటి సమయంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో క్లాష్ వద్దనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు.. ‘సర్కారు వారి పాట’ సినిమాను ఉగాది కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదిపై అఫీషియల్‌ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. మొత్తంగా సంక్రాంతి రేసులో జనవరి 7 ’ఆర్ఆర్ఆర్’ తర్వాత జనవరి 14న ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధే శ్యామ్’ మాత్రమే రిలీజయ్యే అవకాశాలున్నాయి. ఐతే.. గీతే.. నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’, వెంకటేష్,వరుణ్ తేజ్‌ల ‘ఎఫ్ 3’ మూవీలు విడులయ్యే అవకాశాలున్నాయి. కానీ నాగార్జున, వెంకటేష్.. ‘ఆర్ఆర్ఆర్’ ‘రాధే శ్యామ్’ సినిమాలకు పోటీగా తమ సినిమాలను విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: