Pawan Kalyan - Mahesh Babu: తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు.. సూపర్ స్టార్ మహేష్ బాబుకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు వీళ్లిద్దరు తెలుగులో 25 చిత్రాల మైలురాళ్లను అందుకున్నారు. అంతేేనా వీళ్లిద్దరు నట వారసులుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమ కంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరు ఎపుడు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడిన సందర్భాలు లేవు. కానీ 2022 సంక్రాంతి బరిలో వీళ్లిద్దరు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో చేస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అంతకు ముందు .. మహేష్ బాబు.. పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాను పొంగల్‌కు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో వచ్చే సంక్రాంతి బరిపై అందరి దృష్టి పడింది.ఫస్ట్ టైమ్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్న వీళ్లిద్దరి సినిమాలపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరి హర వీల్లు’ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
శివరాత్రి కానుకగా ఈ టీజర్‌ను విడుదల చేసారు. ఇక హీరోగా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రూ. 150 కోట్లతో మొఘలుల కాలం నాటి పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.తాజాగా పవన్ కళ్యాణ్‌ను చూసి మహేష్ బాబు తన మనసు మార్చుకున్నట్టు సమాచారం.
ఈయన హీరోగా పరశురామ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘సర్కారు వారి పాట’ సినిమాను ముందుగా తెలుగులో తెరకెక్కించాలనుకున్నారు. కానీ ఇపుడు ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళంలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. హీరోగా మహేష్ బాబుకు ఇది తొలి ప్యాన్ ఇండియా మూవీ అవుతోంది. హీరోగా మహేష్ బాబుకు ప్యాన్ ఇండియా లెవల్లో అభిమానులున్నారు. అందుకే ఈ చిత్రాన్ని కూడా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. మొత్తంగా సర్కారు వారి పాటను ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ దగ్గర ఆ సందడి మాములుగా ఉండదు. మొత్తంగా పవన్ కళ్యాణ్ రూట్లో మహేష్ బాబు.. సర్కారు వారి పాటను సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood news, Krish, Mahesh Babu, ParasuRam, Pawan kalyan, Sarkaru Vaari Paata, Tollywood