బెస్ట్ ఫ్రెండ్ కోసం ‘గొంతు సవరించుకుంటున్న’ పవన్ కళ్యాణ్

గతంలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి సిినిమాకు వాయిస్ ఓవర్ చెప్పిన పవన్ కళ్యాణ్ మరోసారి గొంతు సవరించుకోనున్నారు.

news18-telugu
Updated: December 4, 2019, 5:57 PM IST
బెస్ట్ ఫ్రెండ్ కోసం ‘గొంతు సవరించుకుంటున్న’ పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ (Image:Janasena Party/Twitter)
  • Share this:
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి గొంతు సవరించుకుంటున్నారు. మొన్నటికి మొన్న తన అన్న మెగాస్టార్ చిరంజీవి కోసం సైరా నరసింహారెడ్డి సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పిన పవన్ కళ్యాణ్ మరోసారి తన బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం మరో సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పనున్నట్టు తెలిసింది. సైరా నరసింహారెడ్డి సినిమాకు మరింత పబ్లిసిటీ తీసుకురావడానికి పవన్ కళ్యాణ్ వాయిస్ కూడా ప్లస్ అయింది. దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అల వైకుంఠపురములో సినిమాకు కూడా పవన్ కళ్యాణ్‌తో వాయిస్ చెప్పించాలని భావిస్తున్నారని, ఈ విషయంపై పవన్ కళ్యాణ్‌ను కూడా కోరినట్టు సమాచారం.

త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న అల వైకుంఠపురములో సినిమాకు ఇప్పటికే ఫుల్ క్రేజ్ వచ్చింది. టీజర్‌కు, సామజవరగమన, రాములో రాములా సాంగ్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ టెంపో కంటిన్యూ చేయాలంటే పవన్ కళ్యాణ్‌తో ట్రైలర్‌కు వాయిస్ చెప్పించాలని త్రివిక్రమ్ భావిస్తున్నారు. గతంలో పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌తో అల్లు అర్జున్ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పించనున్నాడు మాటల మాంత్రికుడు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...