పవన్ కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు మార్షల్ ఆర్ట్స్‌లో కూడా ఎంట్రీ ఉందని అందరికీ తెలుసు. కెరీర్ కొత్తలో చేసిన సినిమాల్లో కూడా మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ చూపించాడు పవర్ స్టార్. అప్పట్లో చదువు ఈయనకు పెద్దగా ఎక్కలేదు. దాంతో వచ్చిన వరకు మాత్రమే చదువుకున్నాడు. ఇప్పటికీ చెప్తుంటాడు కూడా.. తనకు ఎందుకో కానీ చదువు ఎక్కలేదని. ఇదిలా ఉంటే చదువు రాలేదు కాబట్టి సినిమా కోసమే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడేమో అని అంతా అనుకున్నారు. కానీ కారణం మాత్రం అది కాదు. పవన్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోడానికి కారణం చిరంజీవి. అవును.. అప్పట్లో నాగబాబుకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని చిరంజీవి అనుకున్నాడు కానీ కుదర్లేదు. ఆయన ఎందుకో కానీ ఆసక్తి చూపించలేదు. పవన్ కూడా ముందు నుంచి మార్షల్ ఆర్ట్స్‌పై అస్సలు ఆసక్తి చూపించలేదు. కానీ అనుకోని పరిస్థితుల్లో అది నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది ఈయనకు. అదెలా అంటే.. చెన్నైలో కాలేజ్ చేసేటప్పుడు కొందరు చిరంజీవి సినిమాలు చూసి అతన్ని ఊరికే తిట్టేవాళ్లు.. కాలేజీలో కొందరు పవన్ ముందే తన అన్నయ్య నటనతో పాటు లుక్‌పై కూడా కొన్ని విమర్శలు చేసే వాళ్లు. అలాంటివి విన్నపుడు పవన్ రక్తం మరిగిపోయినా కూడా సన్నగా రివటలా ఉన్న తను వాళ్లను ఎదిరించలేకపోయాడు. అప్పుడే మార్షల్ ఆర్ట్స్ ఆలోచన పవన్ బుర్రలోకి వచ్చింది.

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ (pawan kalyan martial arts)
తన అన్నయ్యను కామెంట్ చేస్తున్న వాళ్ల తుక్కు రేగ్గొట్టాలంటే తనకు తెలిసిన మార్గం కరాటే మాత్రమే అని శిక్షణ తీసుకున్నాడు. బ్లాక్ బెల్ట్ కూడా అందుకున్నాడు. ఆ తర్వాత అదే తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో పాటు తమ్ముడు, బద్రి, ఖుషీ, జల్సా లాంటి సినిమాల్లో చూపించాడు. ఇప్పటికీ పవన్‌లో ఆ ఎనర్జీ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ అన్నయ్య అంటే అదే ఆరాధనాభావంతో ఉంటాడు పవర్ స్టార్.

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ (pawan kalyan martial arts)
చిరును ఎవరైనా ఏమైనా అంటే ఫైర్ అవుతుంటాడు. జనసేన పార్టీ స్థాపించిన తర్వాత కూడా అప్పుడప్పుడూ అన్నయ్య చిరంజీవికి జరిగిన అన్యాయం గురించి నోరు విప్పాడు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో అన్నకు వెన్నుపోటు పొడిచారంటూ కామెంట్ చేసాడు. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ చాలా బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమాతో పాటు క్రిష్, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్, సాగర్ కే చంద్ర సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Published by:Praveen Kumar Vadla
First published:January 19, 2021, 20:39 IST