Home /News /movies /

PAWAN KALYAN LAUNCHES SAI DHARAM TEJ AND DEVA KATTA FILM SR

అల్లుడిని ఆశీర్వదించడానికి వచ్చిన మేనమామ..

సాయి తేజ్, నివేథాతో పవన్ Photo : Twitter

సాయి తేజ్, నివేథాతో పవన్ Photo : Twitter

మెగా హీరో సాయి తేజ్ కొత్త సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంది.

    మెగా హీరో సాయి తేజ్ కొత్త సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలను జరుపుకుంది. 'ప్రస్థానం' తో తెలుగు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దేవకట్టాతో సాయి తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు. వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత సాయి తేజ్ ఇటీవల బ్యాక్ బ్యాక్ రెండు సినిమాలతో మంచి హిట్‌లు అందుకున్నాడు. ఆయన నటించిన ‘చిత్రలహరి, ప్రతిరోజూ పండగే’ మంచి విజయాన్ని పొందాయి. ప్రస్తుతం సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే ఎంటెర్టైనర్ చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే సాయి తేజ్ మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. 'ప్రస్థానం' సినిమాతో ప్రశంసలు అందుకున్న దేవకట్టాతో ఆయన ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హజరై టీమ్‌కు బెస్ట్ విషేస్ తెలిపాడు. కాగా కొన్ని సంవత్సరాల నుండి వరుసగా ప్లాప్స్‌తో సతమతమవుతున్న సాయి తేజ్.. ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వరుసగా రెండు విజయవంతమైన సినిమాలను అందించాడు. దీంతో మెగా అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే దేవ కట్టాతో వస్తోన్న ఈ సినిమా ఆయన శైలిలోనే ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతోందట. మరీ ఈ సినిమా ఫలితం ఎలా ఉండనుందో అని ఆసక్తిగా ఉన్నారు ఆయన అభిమానులు.

    దేవ కట్టా, అల్లు అరవింద్, సాయి తేజ్, నివేథా, పవన్ Photo : Twitter


    కాగా ఈ సినిమాలో సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది.  ఈ భామ ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన 'అల వైకుంఠపురములో' లలో నటించి బంపర్ హిట్ అందుకుంది. ఇక ఇతర ముఖ్య పాత్రల్లో జగపతిబాబు, రమకృష్ణ నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించబోతున్నాడు. భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Sai Dharam Tej

    తదుపరి వార్తలు