హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రారంభం..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్‌సైట్ ప్రారంభం..

Pawan Kalyan launched Telugu Film Journalist Association official website Twitter

Pawan Kalyan launched Telugu Film Journalist Association official website Twitter

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే పవన్ కళ్యాణ్ ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. ఇక అది అలా ఉంటే పవన్ ఈరోజు తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్‌సైట్‌ను, సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను ప్రారంభించారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  (Pawan Kalyan ) తాజాగా  (Telugu Film Journalist Association)  తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ సైట్‌ను (TFJA) ప్రారంభించారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెబ్ సైట్ ప్రారంభం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మి నారాయణ, జనరల్ సెక్రెటరీ వై. జె. రాంబాబు, ట్రెజరర్  నాయుడు  సురేంద్ర కుమార్‌ల ఆధ్వర్యంలో 175 మంది సభ్యులున్న ఈ తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ చాలా నిర్దిష్టమైన ప్రమాణాలకు లోబడి ఉండే తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ వెబ్ సైట్ ని, యూట్యూబ్ ఛానల్ ని నా చేతుల మీదగా ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. 175 మంది సభ్యులున్న ఈ అసోసియేషన్ లో నాకు బాగా నచ్చిన అంశం, జర్నలిస్టుల కుటుంబ సభ్యులకి 3 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ కల్పించడం, జీవిత భీమా కింద 15 లక్షలు, ఆక్సిడెంట్ పాలసీ కింద 25 లక్షలు ఇవ్వడం వారి కుటుంభం సభ్యులకి ధైర్యాన్ని ఇస్తుందన్నారు. ఈ 175 మంది జర్నలిస్టుల పై ఆధారపడ్డ వారిని కలిపి దాదాపు 700 మందికి అవసరమొచ్చినప్పుడు ఆసరా లభిస్తుంది. అలాగే వీరు ఆదర్శవంతమైన జర్నలిజం, సమాజంలోని తప్పొప్పులని సరి చేసేలాగా, అవసరం లేని వివాదాల జోలికి వెళ్లకుండా, అలా ఏమైనా జరిగినా గాడిన పెట్టే అసోసియేషన్ అవుతుంది అని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియ చేసుకుంటున్నాను అని తెలిపారు పవన్.

  ఇక పవన్ కళ్యాణ్  (Pawan Kalyan ) సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఓవైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే పవన్ కళ్యాణ్ ఓ నాలుగు సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్, స్టైలీష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అప్పట్లో అధికారిక ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని.. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాను చేయడం లేదని.. ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అలాంటిదేమీ లేదని.. తాజాగా నిర్మాత రామ్ తాళ్లూరి మరోసారి ప్రకటించారు. ఆయన ట్విట్టర్‌లో పేర్కోంటూ.. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని‌తో ఏజెంట్‌ చిత్రం చేసిన తర్వాత తమ ప్రారంభమవుతుందని నిర్మాత రామ్ ధృవీకరించారు. ఈ సినిమాకు ప్రముఖ రచయిత వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించనున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనుంది. ఇక ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

  ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే..  పవన్  (Pawan Kalyan) నటిస్తోన్న లేటెస్ట్ హిస్టోరికల్ ఫిక్షన్ హరి హరి వీరమల్లు (hari hara veera mallu). క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏం ఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది.  పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని టీమ్ ఈరోజు ఓ ఖతర్నాక్ అప్డేట్‌ను ఇచ్చింది. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. సమ్మర్  కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని  2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు.

  మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు.  ఇక ఆ సినిమాతో పాటు తమిళ సినిమా వినోదయ సీతం తెలుగు రీమేక్‌‌ను చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ 20 రోజులు కేటాయించారు పవన్. ఈ తెలుగు రీమేక్‌కు కూడా సముద్రఖని దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో పవన్ మేనల్లుడు, స్టార్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలతో పాటు పవన్, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ చేయనున్నారు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Pawan kalyan, Tollywood news

  ఉత్తమ కథలు