క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ లీక్.. వైరల్ అవుతున్న ఫోటో..

ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. తాజాగా క్రిష్ సినిమాకు సంబంధించిన లుక్ సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: March 16, 2020, 7:21 PM IST
క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ లీక్.. వైరల్ అవుతున్న ఫోటో..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
  • Share this:
ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో పవన్ కళ్యాన్ ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్.. డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఒకటి పెద్ద తరహా పాత్రైతే.. రెండోది యంగ్ క్యారెక్టర్. యంగ్ పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్‌తో డ్యూయట్స్ అవి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌,అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠి దాదాపు ఖరారైంది. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు, హీరోయిన్‌తో కొన్ని సీన్స్ మాత్రమే బాకీ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే థియేటర్స్ మూత పడ్డాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదిని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం.ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో  పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా.

pawan kalyan latest look in krish movie go viral on social media,pawan kalyan new look,pawan kalyan vakeel saab,pawan kalyan Virupakshi,pawan kalyan Virupakshi movie,pawan kalyan krish Virupakshi title,pawan kalyan Virupakshi pspk 27,pawan kalyan janasena,pawan kalyan movies,pawan kalyan krish movie shooting,janasena pawan kalyan,telugu cinema,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ విరూపాక్షి,తెలుగు సినిమా,పవన్ కళ్యాణ్ క్రిష్ విరూపాక్షి,పవన్ కళ్యాణ్ విరూపాక్షి,పవన్ కళ్యాణ్ న్యూ లుక్
పవన్ కళ్యాణ్ కొత్త లుక్ (Twitter/Pjhoto)


ఈ సినిమా కోసమే లుక్ కూడా మార్చేసాడు పవర్ స్టార్. కోరమీసాలతో ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ ప్రస్తుతం బాగా ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ సినిమాలో పవన్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ఇందులో బందిపోటు పాత్రలో పవన్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. పీరియాడికల్ సినిమా కావడంతో పవన్ కూడా ఈ చిత్రం కోసం చాలానే కష్టపడుతున్నాడు. ఇప్పటి వరకు కెరీర్‌లో ఒక్కసారి కూడా ఈయన చారిత్రాత్మక సినిమా చేయలేదు. క్రిష్ చెప్పిన కథ నచ్చడంతో ఈయన ఆ తరహా సినిమా చేస్తున్నాడు. ఇది పవన్ కళ్యాణ్ 27వ సినిమా. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత ఏడాది పాటు కూర్చుని క్రిష్ రాసుకున్న కథ ఇది. పింక్ రీమేక్ వకీల్ సాబ్ పూర్తైన తర్వాత పూర్తి డేట్స్ క్రిష్ చిత్రానికి కేటాయించబోతున్నాడు పవర్ స్టార్. ఈ సినిమాలో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు.

పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)


పాలమూరు పండుగ సాయన్న జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే డిఫెరెంట్ టైటిల్ వినిపిస్తుంది. ఇందులో పవన్ పాత్ర పేరు వీర. అందుకే ఈ సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టారని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం పవన్ చాలా కష్టపడుతున్నాడు. విజువల్‌గా కూడా చాలా రిచ్‌గా ఉండబోతుంది ఈ చిత్రం. దాదాపు 100 కోట్లతో ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమాలో హీరోయిజం కంటే కూడా కథకే ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్రం కోసమే ప్రత్యేకంగా చార్మినార్, తాజ్ మహల్ సెట్స్ కూడా నిర్మించారు. 2021లో సినిమా విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు.
Published by: Kiran Kumar Thanjavur
First published: March 16, 2020, 7:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading