Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..

ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్ ఇవ్వడంతో పవన్ కళ్యాణ్ వెంటనే కార్యరంగంలోకి దిగనున్నాడు.

news18-telugu
Updated: May 24, 2020, 1:06 PM IST
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త..
పవన్ కళ్యాణ్ (Twitter/Pjhoto)
  • Share this:
ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమాను ‘వకీల్ సాబ్’ టైటిల్‌తో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో పవన్ కళ్యాన్ ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్‌,అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా ఇలియానాను అనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు, హీరోయిన్‌తో కొన్ని సీన్స్ మాత్రమే బాకీ ఉన్నాయి. ఈ చిత్రాన్ని ముందుగా మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా వైరస్ ఎఫెక్ట్‌తో ఇప్పటికే థియేటర్స్ మూత పడ్డాయి. దీంతో ఈ సినిమా విడుదల తేదిని త్వరలోనే అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నట్టు సమాచారం. అంతేకాదు లాక్‌డౌన్ తర్వాత మొట్ట మొదట విడుదలయ్యేది పవన్ కళ్యాణ్ సినిమానే అని అందరు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్‌కు పర్మిషన్స్ ఇవ్వడంతో జూన్ నుంచి ఈ సినిమాలో మిగిలిన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ ఫినిష్ చేయనున్నారు.  ఈ సినిమా తర్వాత జూలై నుంచి క్రిష్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను పవన్ కళ్యాణ్‌ను స్టార్ట్ చేయనున్నారు.

పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
పవన్ కళ్యాణ్,క్రిష్ (twitter/Pawan Kalyan)


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను క్రిష్ స్టార్ట్ చేసాడు. పవన్ కళ్యాణ్‌తో రెండు మూడు సీన్స్ కూడా చిత్రీకరించాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ లేని సీన్స్‌ను డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రానికి ‘విరూపాక్షి’ అనే పేరు పరిశీలిస్తున్నారు.  ఈ సినిమాను మొగలాయిల కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కుతోందని సమాచారం.  అంతేకాదు ఈ స్టోరీ కోహినూర్ వజ్రం నేపథ్యంలో తెరకెక్కుతోందనే  ప్రచారం జరుగుతోంది. ఈ  సినిమాను ముందుగా నిర్ణయించిన ప్రకారం విదేశాల్లో చిత్రీకరించాలన్నారు. ప్రస్తుతం కోవిడ్ 19 ఎఫెక్ట్ కారణంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయనున్నట్టు సమాచారం. ఈ  సినిమాను జూలైలో మొదలుపెట్టి ఆగష్టు చివరి నాటికి కంప్లీట్ చేయనున్నట్టు సమాచారం. ఒక్కసారి క్రిష్ రంగంలోకి దిగాడంటే షూటింగ్ కంప్లీట్ చేయడం అంత పెద్ద విషయమేమి కాదు. క్రిష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్... హరీష్ శంకర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: May 24, 2020, 1:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading