ఒక వైపు రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో ఈ గ్యాప్‌లో వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే శ్రీరామ్ వేణు దర్శకత్వంలో హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ సినిమా రీమేక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘లాయర్ సాబ్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. 0రీమేక్ కోసం కేవలం 25 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడు పవన్. తెలుగులో పవన్ కళ్యాన్ ఇమేజ్‌కు తగ్గట్టు కమర్షియల్‌గా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు సమాచారం. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్.. డ్యూయల్ రోల్లో యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఒకటి పెద్ద తరహా పాత్రైతే.. రెండోది యంగ్ క్యారెక్టర్. యంగ్ పవన్ కళ్యాణ్‌కు హీరోయిన్‌తో డ్యూయట్స్ అవి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నివేదా థామస్,అనన్య ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ చిత్రాన్ని మే 15న సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు రీసెంట్‌గా కొబ్బరికాయ కొట్టిన సంగతి తెలిసిందే కదా.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైంది. మొదటి షెడ్యూల్,మొదటి రోజు షూట్‌కు పవన్ కూడా హాజరయ్యాడు. తాజాగా ఈ సినిమా ఆన్ సెట్ స్టిల్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. మరో ముఖ్యపాత్రలో అనసూయ యాక్ట్ చేయనున్నట్టు సమాచారం.ఈ చిత్రం కోసం పవన్ కళ్యాణ్ 15 రోజుల కాల్షీట్స్ కేటాయించాడు.
ఈ సినిమాను ఏ.ఎం.రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. ఈ సినిమాను స్వాతంత్య్ర ఉద్యమానికి ముందు జరిగిన కొన్ని సన్నివేశాలకు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా బందిపోటు దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని స్పూర్తిగా తీసుకొని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Krish, Pawan kalyan, PSPK 26, PSPK 27, PSPK 28, Telugu Cinema, Tollywood