• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN KRISH MAY CONSIDER SENIOR NTR OLD MOVIE TITLES BANDIPOTU OR GAJA DONGA TA

క్రిష్‌తో చేస్తోన్న సినిమాకు ఎన్టీఆర్ హెల్ప్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్..

క్రిష్‌తో చేస్తోన్న సినిమాకు ఎన్టీఆర్ హెల్ప్ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్,క్రిష్ (Pawan Kalyan Krish)

క్రిష్‌తో చేయబోతున్న కొత్త సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ సహాయం తీసుకోబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. 

  • Share this:
    క్రిష్‌తో చేయబోతున్న కొత్త సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఎన్టీఆర్ సహాయం తీసుకోబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్  ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో  ‘వకీల్‌ సాబ్’‌ చిత్రం చేస్తున్నాడు. ఒకవేళ కరోనా మహామ్మారి లేకపోయి ఉంటే.. ఈ పాటికీ ‘వకీల్ సాబ్’ సినిమా విడుదలై ఉండేది కూడా. ఆ చిత్రంతో పాటు క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు.ఇందులో క్రిష్ సినిమా కూడా ఇప్పటికే మొదలైపోయింది. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరుపుకుంది. అంతలోనే కరోనా రావడంతో అంతా ఆగిపోయింది. ఈ సినిమా పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. కోహినూర్ వజ్రం నాటి కథతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను క్రిష్ పాన్ ఇండియా లెవల్లో భారీ ఎత్తున చిత్రీకరిస్తున్నాడు. ముందుగా కమర్షియల్ అంశాల జోలికి వెళ్లొద్దని అనుకున్నాడు కానీ..   కానీ క్రిష్.. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు మాస్ ఎలిమెంట్స్ బాగానే ఉండేటట్టు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

    పవన్ కళ్యాణ్, క్రిష్ (Pawan Kalyan Krish)
    పవన్ కళ్యాణ్, క్రిష్ (Pawan Kalyan Krish)


    ఈ సినిమాకు ముందుగా ‘విరూపాక్షి’ అనే టైటిల్ అనుకున్నారు. ఈ టైటిల్ మాస్‌లో అంతగా పేలలేదు. అందుకే కథ ప్రకారం ఈ సినిమాకు మాస్‌లో బాగా ఎలివేట్ అయ్యే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం. ఈ సినిమాను సీనియర్ ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ టైటిల్స్ ‘బందిపోటు’ లేదా ‘గజదొంగ’ అనే టైటిల్స్ పెడితే ఎలా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తంగా పవన్ కళ్యాణ్, క్రిష్ మాత్రం ఈ సినిమాకు ‘గజ దొంగ’ లేదా ’బందిపోటు’ఈ రెండు పేర్లలో ఏది పెడతారనేది చూడాలి.

    పవన్ కళ్యాణ్ (twitter/Pawan Kalyan)
    పవన్ కళ్యాణ్,క్రిష్ (twitter/Pawan Kalyan)


    ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఆల్మొస్ట్ కన్ఫామ్ చేసారు. మరోవైపు పవన్ కళ్యాణ్‌ను ఢీ కొట్టే విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటిస్తున్నట్టు సమాచారం. ముందుగా కథ ప్రకారం ఈ చిత్రంలో కేవలం రెండు పాటలు మాత్రమే పెట్టాలనుకున్నారు. కానీ క్రిష్ మాత్రం మరో మూడు పాటలను కలిపి మొత్తంగా ఐదు పాటలు ఉండేలా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ ఫైనలైజ్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం  నిర్మిస్తున్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: