PAWAN KALYAN KRISH JAGARLAMUDI HARI HARA VEERAMALLU AUDIO RIGHTS ACQUIRED BY TIPS SR
Pawan Kalyan : హరి హర వీరమల్లు ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకున్న టిప్స్ సంస్థ.. అధికారిక ప్రకటన...
Hari Hara Veera Mallu Photo : Twitter
Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈచిత్రం ఆడియో రైట్స్‌ను టిప్స్ సంస్థ సొంతం చేసుకుంది.
పవన్ కళ్యాణ్.. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వజ్రాల దొంగగా కనిపించనున్నారని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు వేస్తోంది చిత్రబృందం. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారట. కరోనా పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగు మొదలవుతుందని అంటున్నారు. ఇక అది అలా ఉంటే ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి టిప్స్ మ్యూజిక్ ఓ ప్రకటనను విడుదల చేసింది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. టిప్స్ సంస్థ హరి హర వీరమల్లు సినిమాతో పాటు సమంత ప్రధాన పాత్రలో వస్తున్న శాకుంతలం అనే సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ను కూడా భారీ ధరకు దక్కించుకుంది.
హరి హర వీరమల్లు విషయానికి వస్తే.. చారిత్రక నేపథ్యంలో పవన్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా విడుదలైపై ఇంతవరకు క్లారిటీ లేదు. కరోనా కారణంగా అన్ని సినిమాల విడుదల తేదీల్లో భారీగా మార్పులు జరిగాయి. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు.
ఇక ఆ సినిమాతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం.
ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమా విషయానికి వస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే వేసవిలో విడుదలకానున్న భీమ్లా నాయక్ నైజాం హక్కులు 40 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని టాక్ నడుస్తోంది. నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. దాదాపు 5.04 కోట్ల రూపాయలకు ప్రముఖ సంస్థ (Aditya music) ఆదిత్య మ్యూజిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా దగ్గుబాటి (Rana Daggubati) పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. వీరికి జంటగా నిత్య మీనన్, (Nithya menen) సంయుక్త మీనన్ (Samyuktha Menon) నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ఈ సినిమాలో డేనియల్ శేఖర్ పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘యథా కాలమ్.. తథా వ్యవహరమ్.. అనే సినిమాను చేస్తున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.