Hari Hara Veeramallu release date: పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ డేట్ కన్పర్మ్.. ‘KGF 2’తో రెండు వారాల గ్యాప్..

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ (Hari Hara Veeramallu release date)

Hari Hara Veeramallu release date: చూస్తుంటే 2022 పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఏడాది పవన్ నుంచి మూడు సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. తాజాగా ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu release date) రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయింది.

  • Share this:
చూస్తుంటే 2022 పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా కనిపిస్తుంది. ఎందుకంటే వచ్చే ఏడాది పవన్ నుంచి మూడు సినిమాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే సంక్రాంతికి ఈయన నటిస్తున్న ‘భీమ్లా నాయక్’ సినిమా విడుదల కానుంది. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ సినిమాను కుర్ర దర్శకుడు సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హిస్టారికల్ డ్రామా ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాలో బందిపోటు పాత్రలో పవన్ నటిస్తున్నాడు. ఈ చిత్రం ఎప్రిల్ 29, 2022న విడుదల కానున్నట్లు ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఎప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా కెజియఫ్ 2 సినిమా విడుదల కానుంది. ఆ సినిమాకు రెండు వారాలు గ్యాప్ ఇచ్చి.. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నాడు.

ఇది పాన్ ఇండియన్ ప్రాజెక్టుగానే వస్తుంది. తెలుగుతో పాటు ఒకేరోజు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో హరి హర వీరమల్లు విడుదల కానుంది. కోహినూర్ వజ్రం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఇందులో ఔరంగ జేబు పాత్రలో బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ నటిస్తున్నాడు. నిధి అగర్వాల్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా కనిపిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు ఈ సినిమాకు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యమైంది.

Jr NTR - Harikrishna: నాన్న వల్లే అది చూడటం ఆపేసా.. తండ్రి హరికృష్ణను గుర్తు చేసుకున్న ఎన్టీఆర్..


లేదంటే సంక్రాంతికే సినిమా విడుదలయ్యేది. ఇదే విషయాన్ని నిర్మాత ఏఎం రత్నం కూడా కన్ఫర్మ్ చేసారు. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో హరి హర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నారు ఏఎం రత్నం. ఖుషీ సినిమా తర్వాత మరోసారి పవన్‌తో ఈయన చేస్తున్న సినిమా ఇది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. ఎప్రిల్ 27, 2001న ఖుషీ సినిమా విడుదలైంది. సరిగ్గా ఖుషీ వచ్చిన తేదీకి రెండు రోజుల తర్వాత హరి హర వీరమల్లు సినిమాను విడుదల చేయబోతున్నారు నిర్మాత రత్నం.

Bheemla Nayak Title song: ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ విడుదల.. పవన్ ఇమేజ్‌కు సరిపోయే పర్ఫెక్ట్ లిరిక్స్..


ఖుషీ డేట్ రోజే ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా కొన్ని పరిస్థితుల కారణంగా రెండు రోజుల తర్వాత తీసుకొస్తున్నారు. పవన్ తొలిసారి నటిస్తున్న హిస్టారికల్ సినిమా కావడంతో అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. విజువల్ వండర్‌గా ‘హరి హర వీరమల్లు’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఈ సినిమాతో పాటు హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాల్లో కూడా నటిస్తున్నాడు పవర్ స్టార్. మొత్తానికి సంక్రాంతికి భీమ్లా నాయక్‌గా వచ్చి.. సమ్మర్‌లో వీరమల్లుగా వీరంగం చేయబోతున్నాడు పవర్ స్టార్. హరీష్ శంకర్ సినిమా 2022 చివర్లో విడుదల కానుంది.
Published by:Praveen Kumar Vadla
First published: