• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN JANASENA CHIEF TESTED CORONA POSITIVE VAKEEL SAAB FANS GET TENSION TA

Pawan Kalyan Corona Positive: పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో వకీల్ సాబ్ ఫ్యాన్స్..

Pawan Kalyan Corona Positive: పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఆందోళనలో వకీల్ సాబ్ ఫ్యాన్స్..

పవన్ కళ్యాణ్‌కు కరోనా పాజిటివ్ (Twitter/Photo)

Pawan Kalyan Corona Test: మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త మూడు, నాలుగు వారాలుగా  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

  • Share this:
    Pawan Kalyan Corona Test: మన దేశంలో  క‌రోనా  సెకండ్ వేవ్  తీవ్ర రూపం దాలుస్తోంది. గ‌త మూడు, నాలుగు వారాలుగా  దేశ‌వ్యాప్తంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్ర‌మంలో షూటింగ్‌ల‌లో పాల్గొంటున్న సినీ ప్ర‌ముఖులు ఒక్కొక్క‌రుగా ఈ వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ నటులు కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు షెడ్యూల్ చేసుకున్న షూటింగ్‌లు క్యాన్సిల్ కావడంతో నిర్మాతలపై పెను భారం పడుతోంది. మరోవైపు ‘వకీల్ సాబ్’ పవన్ కళ్యాణ్‌ను కరోనా భయం వెంటాడుతోంది. జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సంబంధించిన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది  కరోనా బారిన పడ్డారు. ఈ సందర్భంగా డాక్టర్ల సలహా మేరకు పవన్ కళ్యాణ్ సెల్ఫ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. గత వారం పది రోజులుగా పవన్ కళ్యాణ్ పరివారంలోనివారు ఒక్కొక్కరుగా కరోనా బాధపడుతూ వస్తున్నారు. వీరందరు ఆయనకు సమీపంగా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా.. కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు.

    హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్‌లో కరోనా టెస్ట్ చేయించుకున్న పవన్ కళ్యాణ్ (Twitter/Photo)


    తాజాగా పవన్ కళ్యాణ్.. హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో కరోనా పరీక్షలు చేయించుకోగా.. పవన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో పవన్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పవన్ కు కరోనా సోకిన విషయాన్ని జనసేన పార్టీ అఫీషియల్‌గా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఆయన చికిత్స కొనసాగుతోంది.

    ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్‌తో పాటు.. క్రిష్‌తో ప్యాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. వీటితో పాటు హరీష్ శంకర్, రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: