Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. ఈ యేడాది ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. త్వరలో‘భీమ్లా నాయక్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐతే.. ఈ సినిమా కంటే ముందు ప్రారంభించిన ‘హరి హర వీరమల్లు’ సినిమా మాత్రం కాస్త ఆలస్యంగా పట్టాలెక్కనుంది. తన కెరీర్లో తొలిసారి పవన్ కళ్యాణ్ చారిత్రక పాత్రలో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా మొఘలాయి రాజులను ఎదిరించిన ’హరి హర వీరమల్లు’ ప్రతాపం తెరపై ఎలా ఉండబోతుందో అని కామన్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాన్ వజ్రాల దొంగగా కనిపించనున్నాడని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నారు. కొంత షూటింగ్ కూడ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇటీవలే కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. ఇక రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడ ఇందులో కీలక పాత్రలో నటించనుంది. ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నారు.
ముందుగా ఈ సినిమాను 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తీరా అదే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ మరో మూవీ ‘భీమ్లా నాయక్’ రానుంది. అయితే ఈ సినిమాలో భీమ్లా నాయక్‌గా పవన్ కళ్యాణ్‌ను పరిచయం చేసాము. ఇదే టైటిల్ ఫైనల్ కాదని చెబుతున్నారు. ఈ సినిమాలో రానా పాత్రను పరిచయం చేసిన తర్వాత మరో పేరు ప్రకటిస్తామని చెప్పారు.
కానీ ఇప్పటికే మాస్లో ‘భీమ్లా నాయక్’ టైటిల్ వెళ్లిపోయింది. నిర్మాతలు భీమ్లా నాయక్ కాకుండా మరో పేరు పెడతారనేది చూడాలి. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని వచ్చే యేడాది 27 ఏప్రిల్ 2022న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. పైగా అదే డేట్లో ‘ఖుషీ’ విడుదలై ఘన విజయం సాధించింది. దీంతో సెంటిమెంట్ కలిసొస్తందనే ఉద్దేశ్యంతో హరి హర వీరమల్లు’కు అదే విడుదల తేదిని ఖరారు చేస్తారనేది ఇన్సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ‘హరి హర వీరమల్లు’ సినిమాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఈ చిత్రం నుంచి మేకర్స్ ఫ్యాన్స్ కోసం మేకింగ్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi : లూసీఫర్, వేదాలం కాకుండా... చిరంజీవి ఖాతాలో మరో సూపర్ హిట్ రీమేక్..
Vanitha Vijaykumar : చిరంజీవి ఫ్యామిలీతో వనిత విజయకుమార్ అనుబంధం.. ఆలీతో సరదగా సంచలన వ్యాఖ్యలు..
Rashmika Mandanna: పూల తలపాగాతో రష్మిక మందన్న రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోస్..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bheemla Nayak, Hari hara veeramallu, Pawan kalyan, Tollywood