పవన్ కళ్యాణ్ అంటే ఇది.. కాలర్ ఎగరేస్తున్న అభిమానులు..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఏదో మత్తు ఉంది. మిగిలిన హీరోల మాదిరి ఈయన డాన్సులు చేయడు.. ఏడాదికో సినిమా చేయడు.. అనవసర హంగు ఆర్భాటాలకు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 26, 2020, 2:17 PM IST
పవన్ కళ్యాణ్ అంటే ఇది.. కాలర్ ఎగరేస్తున్న అభిమానులు..
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
  • Share this:
పవన్ కళ్యాణ్.. ఈ పేరులోనే ఏదో మత్తు ఉంది. మిగిలిన హీరోల మాదిరి ఈయన డాన్సులు చేయడు.. ఏడాదికో సినిమా చేయడు.. అనవసర హంగు ఆర్భాటాలకు కూడా పోడు. కానీ ఈయనంటే ఫ్యాన్స్‌కు పిచ్చి.. అభిమానం అనే స్టేజ్ కూడా ఎప్పుడో దాటేసాడు పవన్ కళ్యాణ్. ఎందుకురా పవన్ అంటే అంత పిచ్చి నీకు అని చాలా మంది అడుగుతుంటారు అభిమానులను. దానికి వాళ్లు చెప్పే సమాధానం పవన్ సినిమాలకు కాదు ఆయన వ్యక్తిత్వానికి తాము అభిమానులం అని. ఇప్పుడు కూడా ఇదే చేసి చూపించాడు పవర్ స్టార్.
క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ (Twitter/Photo)
క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ (Twitter/Photo)

తాజాగా కరోనా విజ‌ృంభన సమయంలో తెలుగు ఇండస్ట్రీలో ఒక్కొక్కరుగా సాయం చేస్తూ వచ్చారు. అయితే ఎవరూ ఊహించని సాయం మాత్రం పవన్ చేసాడు. ముందు నుంచి ఈయన విరాళంపై భారీ అంచనాలే ఉన్నాయి. కచ్చితంగా భారీగానే ఇస్తాడనుకున్నారు కానీ ఏకంగా 2 కోట్లు ప్రకటిస్తాడని మాత్రం ఊహించలేదు. అదే పవన్ కళ్యాణ్ అంటున్నారు అభిమానులు. మిగిలిన హీరోల కంటే ఎందుకు ఆయన్ని ఎక్కువగా ఆరాధిస్తారు అభిమానులు అనేదానికి ఇదొక నిదర్శనం మాత్రమే.

పవన్ కళ్యాణ్ లుక్ (Twitter/Pjhoto)
పవన్ కళ్యాణ్ లుక్ (Twitter/Pjhoto)

సామాజిక బాధ్యతలో అందరికంటే ముందుంటాడు ఈయన. విమర్శలను తట్టుకుంటాడు.. ప్రజల కోసం నిలబడతాడనే మంచి పేరు తెచ్చుకున్నాడు పవన్. ఎన్నికల్లో గెలిచినా ఓడినా ప్రజల మధ్యే ఉంటానంటాడు.. బాధ్యతతో ఉండాలంటాడు. అందుకే పవన్ రియల్ హీరో అంటారు ఫ్యాన్స్. ఇప్పుడు కూడా కరోనా బాధితుల సహాయార్థం ఏకంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటి.. ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కోటి ప్రకటించాడు పవర్ స్టార్.
సైనికులకు కోటి విరాళం అందించిన పవన్ (Pawan Kalyan)
సైనికులకు కోటి విరాళం అందించిన పవన్ (Pawan Kalyan)



అంతకుముందు కూడా చాలాసార్లు ఇలాంటి భారీ సాయాలే చేసాడు పవన్. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి అక్కడ సైనిక కుటుంబాలకు కోటి రూపాయలు ఇచ్చి వచ్చాడు. ఇలా ప్రతీ విషయంలోనూ పవన్ చూపించే మానవత్వం.. ఆయన వ్యక్తిత్వమే ఇతర హీరోల నుంచి పవన్‌ను వేరు చేస్తుంది. అందుకే పవన్ కళ్యాణ్ అంటే ఇదిరా అంటూ మరోసారి కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.
First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు