Pawan Kalyan Krish: పవన్ కళ్యాణ్ ప్లాన్స్ అన్నింటికీ కరోనా వైరస్ వచ్చి పాడు చేసింది కానీ లేదంటే ఈ పాటికే ఈయన సినిమా ఒకటి విడుదలై ఉండేది. మరో సినిమా విడుదలకు సిద్ధమై ఉండేది.
పవన్ కళ్యాణ్ ప్లాన్స్ అన్నింటికీ కరోనా వైరస్ వచ్చి పాడు చేసింది కానీ లేదంటే ఈ పాటికే ఈయన సినిమా ఒకటి విడుదలై ఉండేది. మరో సినిమా విడుదలకు సిద్ధమై ఉండేది. అంతలా అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నాడు ఈయన. కానీ ఏం చేస్తాం.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచాడని పవన్ ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోయాయి. ప్రస్తుతం లాక్డౌన్ అయిపోయినా కరోనా కారణంగా షూటింగ్ చేయలేకపోతున్నారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే పవన్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రంతో పాటు క్రిష్, హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. ఇందులో క్రిష్ సినిమా కూడా ఇప్పటికే మొదలైపోయింది.
పవన్ కళ్యాణ్, క్రిష్ (Pawan Kalyan Krish)
కొన్ని రోజులు షూటింగ్ కూడా జరుపుకుంది. అంతలోనే కరోనా రావడంతో అంతా ఆగిపోయింది. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతుంది. కోహినూర్ వజ్రం నాటి కథతో వస్తున్న ఈ చిత్రంలో పవన్ బందిపోటుగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా విషయంలో దర్శకుడు క్రిష్‌కు కళ్లు చెదిరే కండీషన్స్ పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇది విన్న తర్వాత ఆయన కూడా ఓకే అన్నట్లు తెలుస్తుంది. సినిమాలతో పాటు రాజకీయాలతో కూడా బిజీగా ఉన్న పవన్ తన ఇమేజ్‌కు భంగం కలిగించే సన్నివేశాల్లో నటించలేనని ముందుగానే దర్శక నిర్మాతలకు చెప్పేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ లుక్ (Twitter/Photo)
డాన్సులు చేయడాలు.. రొమాన్స్ చేయడాలు లాంటివి పెట్టుకోవద్దని ముందుగానే చెప్పేస్తున్నాడు ఈయన. క్రిష్ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఏం ఉండకపోవచ్చని తెలుస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాక్వలిన్.. అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విరూపాక్ష టైటిల్ కన్ఫర్మ్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కథ ప్రకారం ఈ చిత్రంలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయని తెలుస్తుంది. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.