పవన్ కల్యాణ్‌ను పట్టించుకోని అలీ.. పవన్ కంటే ఆయనకే ప్రియారిటీ..

అలీ పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటోలు)

ఇదే రాపిడ్ ఫైర్‌లో భాగంగా పూరి జగన్నాథ్, రవితేజల్లో ఎవరంటే ఇష్టమని ప్రశ్నించగా.. రవితేజ అని చెప్పాడు అలీ. ఇక చివరలో చిరంజీవి గురించి అడిగిన ఓ ప్రశ్నను మాత్రం పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో పెట్టేశారు.

  • Share this:
    బుల్లితెర స్టార్ యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న 'క్యాష్' లేటెస్ట్ ఎపిసోడ్‌లో హాస్యనటుడు అలీ,నటుడు పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీని సుమ కొన్ని రాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగింది. మొదట ఈ ఇద్దరిలో మీకెవరు ఇష్టం? అని రెండు ఆప్షన్స్ ఇచ్చింది. అందులో ఒకటి రాఘవేంద్రరావు పేరు కాగా.. మరొకటి పవన్ కల్యాణ్ పేరు. అలీ పవన్ కల్యాణ్ పేరు చెబుతాడని చాలామంది భావించారు. కానీ ఆశ్చర్యంగా ఆయన మాత్రం రాఘవేంద్రరావు అంటే ఇష్టమని చెప్పారు.పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుల్లో అలీ ఒకరన్న సంగతి తెలిసిందే. చాలా సినిమాల్లో వీరిద్దరి కాంబినేషన్ హిట్ అయింది.అయితే సార్వత్రిక ఎన్నికల సమయంలో అలీ వైసీపీలో చేరడంతో వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయి. అప్పటి నుంచి అదే గ్యాప్ కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే అలీ పవన్ కల్యాణ్ పేరును పట్టించుకోకుండా రాఘవేంద్రరావు పేరు చెప్పాడనుకోవచ్చు.

    ఇక ఇదే రాపిడ్ ఫైర్‌లో భాగంగా పూరి జగన్నాథ్, రవితేజల్లో ఎవరంటే ఇష్టమని ప్రశ్నించగా.. రవితేజ అని చెప్పాడు అలీ. ఇక చివరలో చిరంజీవి గురించి అడిగిన ఓ ప్రశ్నను మాత్రం పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్‌లో పెట్టేశారు. అదేంటో తెలియాలంటే క్యాష్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రసారమయ్యేవరకు వేచి చూడాల్సిందే. మొత్తానికి అలీ సెటైర్స్,పోసాని మార్క్ ఎంటర్టైన్‌మెంట్‌తో 'క్యాష్' లేటెస్ట్ షో సరదా సరదాగా సాగింది.
    Published by:Srinivas Mittapalli
    First published: