Home /News /movies /

PAWAN KALYAN HUG CHIRANJEEEVI IN PRODUCER DAUGUHTER MARRIAGE FUNCTION VIDEO VIRAL SB

Chiranjeevi Pawan Kalyan:చిరంజీవి, పవన్ కళ్యాణ్ స్వీట్ హగ్..! మెగా ప్లాన్ రెడీ చేస్తున్నారా? ఫ్యాన్స్‌కి ఇది విజువల్ ట్రీట్.

చిరు పవన్ కళ్యాణ్

చిరు పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగానే వైట్ డ్రెస్సులు అదరగొట్టేశాడని చెప్పవచ్చు. చిరు ట్రెడిషనల్ వేర్‌లో సింపుల్‌గా సూపర్బ్ అనిపించారు. వీరితో పాటు నాగచైతన్య, నాగార్జున కూడా వేడుకలో పాల్గొన్నారు.

    మెగాస్టార్ పవర్ స్టార్.. ఒకే వేదికపై కనిపిస్తే... మెగా ఫ్యాన్స్‌కు పండగే.ఇక వాళిద్దరు మాట్లాడుకొని అప్యాయంగా పలకరించుకుంటే అభిమానుల ఆనందాలకు అవధులే ఉండవు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాన్, మెగాస్టార్ చిరంజీవి ఒకే ఫంక్షన్‌కు హాజరయ్యారు. ప్రముఖ  సినీ నిర్మాత ,డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారాయణ కుమార్తె.. జాన్వి నారంగ్ వివాహ మహోత్సవం ఫిలిమ్ నగర్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి సినీ రాజకీయ ప్రముఖులు పలువురు హాజరయ్యారు.

    జాన్వి, ఆదిత్య జంటను ఆశీర్వదించేందుకు ఇండస్ట్రీ నుంచి ప్రముఖులు వచ్చారు. అయితే ఈ పెళ్లి వేడుకలో మెగా బ్రదర్స్ ఇద్దరు ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు. వారే చిరు, పవన్. పవన్ కళ్యాణ్ వచ్చిన కాసేపటికే చిరు కూడా పెళ్లి ఫంక్షన్‌కు హాజరయ్యారు. దీంతో వేదిక అంతా ఒక్కసారిగా కలర్‌ఫుల్‌గా మారింది. చిరు వచ్చేటప్పటికీ అక్కడే ఉన్న పవన్ కళ్యాణ్ వెంటనే చిరు దగ్గరకు వెళ్లిపోయారు. అన్నను అప్యాయంగా పలకరించి గట్టిగా కౌగిలించుకున్నారు. ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతుంది.



    ఇక వీరితో పాటే నాగార్జున గోపీచంద్, శివకార్తికేయన్, నాగచైతన్య తదితర హీరోలు కూడా అటెండ్ అయ్యారు దర్శకులలో శేఖర్ కమ్ముల త్రివిక్రమ్ ,ప్రశాంత్ వర్మ కనిపించారు. ఏషియన్ సినిమాస్ అధినేతలతో భాగస్వామ్యైన దగ్గుబాటి సురేష్ కూడా ఈ పెళ్లికి హాజరు కావడం జరిగింది. వీరితో పాటు పలువురు ప్రముఖులు కూడా నూతన వధూవరులను ఆశీర్వదించారు. గురువారం జరిగిన ఈ వివాహానికి నాగార్జున నాగచైతన్య  రావడంతో వారిని ఫోటోలు తీయడానికి అక్కడున్న ఫోటోగ్రాఫర్లు పోటీపడ్డారు.




    ఇక ఈమె దిగంత నారాయణదాసు కే. నారంగ్ మనవరాలు కావడం గమనార్హం. సినీ ఇండస్ట్రీ లోనే అత్యంత ఖరీదైన వేడుకగా జరిగింది. డైరెక్టర్ త్రివిక్రమ్ తో వివాహానికి వచ్చారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పటిలాగానే వైట్ డ్రెస్సులు అదరగొట్టేశాడని చెప్పవచ్చు. చిరు ట్రెడిషనల్ వేర్‌లో సింపుల్‌గా సూపర్బ్ అనిపించారు. అయితే వీరిద్దరి కలయికపై ఇప్పుడు కొత్త చర్చ మొదలయ్యింది. రాజకీయాల్లో స్పీడ్ పెంచిన పవన్ కళ్యాణ్‌కు నాగబాబు ఫుల్ సపోర్ట్ ఉంది. అటు చిరంజీవి కూడా తమ్ముడి పాలిటిక్స్‌కు మద్దతు ఇస్తారా ? లేదా అనేది చాలామందికి సందేహాలు ఉన్నాయి. తాజాగా వీరిద్దరు కలిసిన తీరు మాట్లాడుకున్న విధానం చూస్తుంటే.. రాబోయే రోజుల్లో పవన్ చేసే రాజకీయాలకు.. చిరు మద్దతు ఉండటం ఖాయం అనిపిస్తోంది. మరి ఈ మెగా బ్రదర్స్ ముందు ముందు పాలిటిక్స్‌లో ఎలా చక్రం తిప్పనున్నారో వెయిట్ చేసి చూడాల్సిందే.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Chiranjeevi, Pawan kalyan

    తదుపరి వార్తలు