పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ రీ ఎంట్రీ తర్వాత ఐదు సినిమాలకు ఓకే చెప్పాడు. అందులో ముందుగా ‘వకీల్‌సాబ్’ చిత్రీకరణను పవన్ పూర్తి చేసుకున్నాడు. తదుపరి పవన్ లిస్టులో ఉన్న నాలుగు సినిమాల్లో ముందు వరుసలో ఉన్న సినిమాల్లో ఒకటి క్రిష్ సినిమా, మరో సినిమా అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్. ఈ రెండు సినిమాలను పవన్ ఒకేసారి చేయడానికి ఓకే చెప్పేశాడని సినీ వర్గాల సమాచారం. ఇటీవల మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమా రీమేక్ సెట్స్‌పైకి వెళుతుందని వార్తలు వినిపించాయి. ఇందులో ముందుగా ఏ సినిమా సెట్స్‌పైకి వెళుతుందనే దానిపై సమాచారం దొరికింది.
వివరాల మేరకు జనవరి 4 నుంచి క్రిష్ సినిమా షూటింగ్లో పవన్‌కల్యాణ్ పాల్గొంటాడట. చిన్న షెడ్యూల్ చిత్రీకరణ తర్వాత అయ్యప్పనుమ్ కోశియమ్ రీమేక్ కోసం నలబై రోజుల కాల్షీట్ను పవన్‌కల్యాణ్ కేటాయించాడట. ఈ షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ చిత్రీకరణలోనే పవన్ కల్యాణ్ పాత్ర చిత్రీకరణ పూర్తవుతుందట. మళ్లీ క్రిష్ సినిమాపై పవన్ ఫోకస్ పెడతాడట.
అంటే వచ్చే ఏడాది రెండు సినిమాల షూటింగ్‌ను పూర్తి చేయడానికి పవన్ కల్యాణ్ ప్లాన్ చేసేసుకున్నాడు. అంటే పక్కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే అటు క్రిష్ సినిమా, ఇటు సాగర్ కెచంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అయ్యప్పనుమ్ కోశియమ్ సినిమా రీమేక్ పూర్తవుతుంది. అంటే మొత్తం మూడు సినిమాలతో పవన్‌కల్యాణ్ అభిమానులను మెప్పించడానికి రెడీ అయిపోతున్నాడని టాక్ వినిపిస్తోంది.