పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్‌తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను చిత్ర యూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకు పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించాడు. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలకు మరో నాలుగేళ్లు ఉండటం.. ఇక తాను స్థాపించిన జనసేన పార్టీని బతికించుకోవడానికి జనసేనాని మళ్లీ ముఖానికి రంగేసిని రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే హిందీలో హిట్టైన ‘పింక్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు ‘వకీల్ సాబ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ నేపథ్యంలో షూటింగ్స్ అన్ని తాత్కాలింగా వాయిదా వేసారు. ఒకవేళ అంతా బాగుండి ఉండే.. ఈ నెల 15న ఈ సినిమాను విడుదల చేసేవారు. కానీ కరోనా నేపథ్యంలో అంతా తలకిందలు అయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ముందుగా ‘వకీల్ సాబ్’ సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత ఆ తర్వాత ‘క్రిష్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నాడు.
పవన్ కళ్యాణ్,హరీష్ శంకర్ (Twitter/Photo)
ఇక పవన్ కళ్యాణ్‌తో హరీష్ శంకర్ సినిమా అనగానే అందరికీ గబ్బర్ సింగ్ సినిమానే గుర్తుకు వస్తోంది. హిందీలో హిట్టైన ‘దబాంగ్’ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు హరీస్ శంకర్ ఈ చిత్రాన్ని మలిచిన తీరు ఇప్పటికీ పవన్ అభిమానులు మరిచిపోలేదు.తాజాగా వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న ఈ చిత్రం గబ్బర్ సింగ్ సినిమాకు రీమేక్ అని చెబుతున్నారు. దీనిపై హరీష్ శంకర్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ఈ సినిమా రీమేక్ అనే వార్తలు వస్తున్నాయి. అది నిజంకాదు.. పవన్ కళ్యాణ్ కోసం ఎపుడో ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేసి పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం (Twitter/Photo)
సరికొత్త కథతోనే పవన్ కళ్యాణ్‌ను తెరపై చూపిస్తానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఈ సినిమాకు గబ్బర్ సింగ్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మరోసారి సంగీతం సమకూర్చబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ అఫీషియల్‌గా తెలియజేసింది. మొత్తానికిి హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కోసం మరోసారి దేవీశ్రీతో అద్భుతమైన ట్యూన్స్ రెడీ చేయిస్తున్నట్టు తెలుస్తోంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.