Pawan Kalyan - Harish Shankar: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాపై క్రేజీ అప్డేట్.. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ స్పెషల్ సెట్‌ను నిర్మించనున్నట్టు సమాచారం.
Pawan Kalyan - Harish Shankar | ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీతో పలకరించారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ సినిమా మరింత వసూళ్లు సాధించి ఉండేది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నా. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు.
ఈ చిత్రాన్ని కూడా ఈ యేడాది దీపావళి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ యేడాది ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు లేవనే మాట వినబడుతోంది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ కెరీర్లో చేస్తోన్న చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు . (Image: Instagram)
అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్లో విడుదల కాబోతున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ కూడా ఇదే. గతంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను కేవలం తెలుగుతో పాటు హిందీలో డబ్ చేసి ఒకేసారి విడుదల చేసారు. కానీ ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో దేశ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (File/Photo)
ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే విషయం స్పష్టమైంది. అంతేకాదు ఈ సినిమాలో డైలాగ్స్, సన్నివేశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను హరీష్ శంకర్ తీర్చిదిద్దినట్టు సమాచారం. మొత్తంగా తన నిజ జీవిత పాత్రను తెరపై చేయనున్నడన్న మాట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్ లెక్చరర్‌గా కనిపించనున్నాడు.ఆ తర్వాత పరిస్థితులు కారణంగా రాజకీయాల్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదే ఈ సినిమా స్టోరీ. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నాడు. ఒకటి కాలేజీ లెక్చరర్ పాత్ర అయితే.. మరోకటి ఐబీ ఆఫీసర్. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో కాలేజ్ సెట్ వేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.