Home /News /movies /

PAWAN KALYAN HARISH SHANKAR FILM UPDATE BHAVADIYUDU BHAGATH SINGH IS THE TITLE HERE ARE THE DETAILS SR

Pawan Kalyan | PSPK 28 : పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాకు టైటిల్ ఖరారు..

పవన్ కళ్యాణ్, హరీస్ శంకర్ (Harish shankar and Pawan Kalyan Photo : Facebook)

పవన్ కళ్యాణ్, హరీస్ శంకర్ (Harish shankar and Pawan Kalyan Photo : Facebook)

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ తన 28వ సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు టైటిల్ ఖరారైంది.

    నటుడు పవన్ కళ్యాణ్.. (Pawan Kalyan) .. ఓ వైపు ఏపీ రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు ఇటు సినిమాల్లో కూడా అదరగొడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఈ లోగా వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. అందులో భాగంగా ఆయన హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ (Gabbar singh) లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అది అలా ఉంటే ఈ సినిమా నుంచి ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నలబై ఐదు నిమిషాలకు ఓ సాలిడ్ అప్ డేట్ రానుందని చిత్రబృందం తాజాగా ప్రకటించింది. అయితే ఇండస్ట్రీ వర్గాల ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

    అంతేకాదు ఈ సినిమాకు “భవదీయుడు భగత్ సింగ్” (Bhavadiyudu Bhagath Singh) అనే పవర్ ఫుల్ టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. స్క్రిప్టు పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకొన్ని రోజుల్లో షూటింగ్‌ను షూరూ చేయనుంది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నాడని టాక్.

    ఇక ఈ సినిమాతో పాటు మరోవైపు పవన్ కళ్యాణ్.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి (Rana Daggubati) మరో హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి  భీమ్లా నాయక్‌ (Bheemla Nayak) అనే పేరు ఖరారు చేసింది చిత్రబృందం. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ మంచి ఆదరణ పొందింది.

    ఇక ఇంకోవైపు పవన్ కళ్యాణ్.. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.

    ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న విడుదలకానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. అందులో భాగంగా ఈ సినిమాలో హీరో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం.

    ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు  శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. దిల్ రాజు, బోణీ కపూర్ నిర్మించారు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా శృతి హాసన్‌ నటించింది. పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించారు.
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Director harish shankar, Harish Shankar, Pawan kalyan, Tollywood news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు