• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • PAWAN KALYAN HARISH SHANKAR FILM COMING WITH AN INTERESTING TITLE HERE ARE THE DETAILS SR

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాకు ఇంట్రెస్టెంట్ టైటిల్..

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ సినిమాకు ఇంట్రెస్టెంట్ టైటిల్..

Harish shankar and Pawan Kalyan Photo : Facebook

Pawan Kalyan : ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. అందులో భాగంగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే..

  • Share this:
    పవన్ కళ్యాణ్.. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఓ నాలుగు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు మరింత సమయం ఉండటంతో ఈ లోగా వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం పింక్ సినిమా తెలుగు రీమేక్ వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లో విడుదలకానుంది. వకీల్ సాబ్ ఏప్రిల్ 9న విడుదలకానుంది. ఈ సినిమాకు  శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్‌కు జోడిగా శృతి హాసన్‌ నటిస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తొలిసారి లాయర్ పాత్రలో కనిపించనున్నారు. అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా హిందీ సినిమా దబాంగ్‌కు రీమేక్‌గా వచ్చింది. ఇక ఈ తాజా సినిమాకు సంబంధించి ఇప్పటికే అఫీషియల్ ప్రకటన కూడా చేసారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ చిత్రం జూలైలో స్టార్ట్ కానుందని తాజా సమాచారం. కాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్‌కు కూడా మొదలుకాలేదు. అప్పుడే టైటిల్ ఖరారు అయ్యిందని తెలిసింది. ఈ సినిమాకు సంచారి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన విడుదలకానుంది.

    ఇక పవన్ కళ్యాణ్ ఇతర సినిమా విషయానికి వస్తే.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నాడు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తోన్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ఈ యేడాది దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. నివేదా పేతురాజ్, నిత్యా మీనన్‌లు హీరోయిన్స్‌గా నటిస్తున్నారని టాక్.

    Pawan kalyan Harish Shankar film coming with an interesting title, Pawan kalyan,Pawan Kalyan Harish Shankar,PSPK 28,Pawan Kalyan Harish Shankar,Pawan kalyan,harish shankar,pawan kalyan harish shankar second sentiment,harish shankar second sentiment,pawan kalyan twitter,harish shankar twitter,harish shnakar controversy,bandla ganesh,bandla ganesh twitter,gabbar singh,gabbar singh movie,gabbar singh movie twitter,8 years for gabbar singh,pawan kalyan,pawan kalyan gabbar singh 8 years,gabbar singh movie records,gabbar singh movie collections,8 years of gabbar singh history,telugu cinema,pawan kalyan shruti haasan,గబ్బర్ సింగ్,పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్‌కు 8 ఏళ్లు,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్,హరీష్ శంకర్ సెంటిమెంట్,సెంటిమెంట్ బ్రేక్ చేస్తున్న హరీష్ శంకర్,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ మూవీ,పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్
    గబ్బర్ సింగ్‌లో వపన్ Photo : Facebook


    పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో సినిమా.. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంవత్సరం అంటే 2022 సంక్రాంతికి విడుదల కానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: