Pawan Kalyan : పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్‌కు ముహూర్తం ఫిక్స్..

భవదీయుడు భగత్ సింగ్ ఫస్ట్ లుక్ Photo : Twitter

Pawan Kalyan : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్” (Bhavadiyudu Bhagath Singh) అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను దసరా సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నారని తెలుస్తోంది.

  • Share this:
    పవన్ కళ్యాణ్ ‘(Pawan Kalyan) హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు “భవదీయుడు భగత్ సింగ్” (Bhavadiyudu Bhagath Singh) అనే పవర్ ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది. అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే నెల 15 న దసరా పండుగ సందర్భంగా లాంఛనంగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలకావాల్సి ఉంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ నిర్మిస్తోంది. స్క్రిప్టు పనులను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. అందులో ఒక పాత్రలో లెక్చరర్‌గా కనిపించనున్నాడని టాక్. గతంలో ఈ కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ (Gabbar singh) లాంటీ బ్లాక్ బస్టర్ సినిమా రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

    ఇక ఈ సినిమాతో పాటు మరోవైపు పవన్ కళ్యాణ్.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి భీమ్లా నాయక్ అనే పేరు ఖరారు చేసింది చిత్రబృందం. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన టైటిల్ సాంగ్ మంచి ఆదరణ పొందింది.

    Rashmika Mandanna | Pushpa : ఆసక్తికరంగా రష్మిక మందన్న ఫస్ట్ లుక్.. శ్రీవల్లిగా అదరగొట్టిందిగా..

    ఇక ఇంకోవైపు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఏ ఎం రత్నం నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన టాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తోంది. బాలీవుడ్ సుందరి జాక్వలైన్ ఫెర్నాండేజ్ స్పెషల్ రోల్ లో కనిపించనున్నదని టాక్.

    Love Story Success Meet : ఘనంగా లవ్ స్టోరి సక్సెస్ మీట్.. క్లాసిక్ ఫిల్మ్ తీశారు : నాగార్జున

    ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 29న విడుదలకానుంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా సాగుతూ.. రాబిన్ హుడ్ తరహాలో ఉన్నవారిని కొట్టి, పేద వారికి అండగా ఉంటాడట హీరో. అందులో భాగంగా ఈ సినిమాలో హీరో పవన్ బందిపోటు పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈసినిమాను పాన్ ఇండియా లెవల్‌లో అన్ని భాషాల్లో విడుదల చేయనుంది చిత్రబృందం. ఈ సినిమాలతో పాటు పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇటీవల విడుదలైంది.
    Published by:Suresh Rachamalla
    First published: