హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan - Harish Shakar : పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ భామను సెట్ చేసిన హరీష్ శంకర్..

Pawan Kalyan - Harish Shakar : పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ భామను సెట్ చేసిన హరీష్ శంకర్..

4. సాయంత్రం 4.05 నిమిషాలకు: హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సినిమాపై అప్‌డేట్

4. సాయంత్రం 4.05 నిమిషాలకు: హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సినిమాపై అప్‌డేట్

Pawan Kalyan - Harish Shankar | వన్ కళ్యాణ్ ‘భీమ్ల నాయక్’, హరి హర వీరమల్లు తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో పవన్ సరసన క్రేజీ భామ నటిస్తోంది. వివరాల్లోకి వెళితే.. 

  Pawan Kalyan - Harish Shankar | పవన్ కళ్యాణ్ సరసన క్రేజీ భామను సెట్ చేసిన హరీష్ శంకర్.. వివరాల్లోకి వెళితే..  త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన  ‘అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీతో పలకరించారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ సినిమా మరింత వసూళ్లు సాధించి ఉండేది. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’  పాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ చిత్రానికి అదే టైటిల్ ఖరారు చేసారు. మరోవైపు ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో డేనియల్ శేఖర్ పాత్రలో కనిపించనున్నారు. త్రివిక్రమ్ మాటలు అందిస్తోన్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమాను శివరాత్రికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

  ఆ సంగతి పక్కన పెడితే..  ఇంకోవైపు పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చేస్తోన్న చారిత్రక నేపథ్యమున్న సినిమా ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ‘భీమ్లా నాయక్’ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమా పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా చేయనున్నారు.

  ఖైదీ టూ ఇంద్ర వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన చిరంజీవి సినిమాలు ఇవే..

  అంతేకాదు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో విడుదల కాబోతున్న తొలి ప్యాన్ ఇండియా మూవీ కూడా ఇదే. గతంలో ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమాను కేవలం తెలుగుతో పాటు హిందీలో డబ్ చేసి  ఒకేసారి విడుదల చేసారు. కానీ ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో దేశ వ్యాప్తంగా  విడుదల చేయనున్నాు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.  ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా చేసారు.

  Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

  ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే విషయం స్పష్టమైంది. అంతేకాదు ఈ సినిమాలో డైలాగ్స్, సన్నివేశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను హరీష్ శంకర్ తీర్చిదిద్దినట్టు సమాచారం. మొత్తంగా తన నిజ జీవిత పాత్రను తెరపై చేయనున్నడన్న మాట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక లెక్చరర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎందుకు మారాడనేదే ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించనుంది. మరోవైపు ప్రియమణి మరో కథానాయికగా యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. పూజా హెగ్డే .. హరీష్ శంకర్.. ‘డీజే’ (దువ్వాడ జగన్నాథం), సినిమాతో పాటు గద్దలకొండ గణేష్ సినిమాల్లో నటించింది. ఇపుడు ముచ్చటగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తోన్న మూడో  చిత్రంలో పూజా హెగ్డే.. పవన్ కళ్యాణ్ సరసన నటించనుంది.

  pooja hegde will play lead role in pawan kalyan pink telugu remake,pooja hegde,pawan kalyan,pink,pink telugu remake,pawa kalyan nayanthara,nayanthara,pawan kalyan trivikram,pawan kalyan pin telugu remake,pooja hegde pawan kalyan,pink pooja hegde pawan kalyan,pawan kalyan twitter,pawan kalyan facebook,pawan kalyan instagram,pooja hegde twitter,pooja hegde instagram,pooja hegde facebook,pooja hegde pawan kalyan trivkiram venu sriram,tollywood,telugu cinema,పూజా హెగ్డే,పవన్ కళ్యాణ్,పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్‌లో పూజా హగ్డే,పూజా హెగ్గే పింక్ రీమేక్,వేణు శ్రీరామ్, దిల్ రాజు బోనీ కపూర్,నయనతార,పవన్ కళ్యాణ్ నయనతార
  పవన్ కళ్యాణ్,పూజా హెగ్డే (Twitter/Photos)

  ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నాడు.ఆ తర్వాత పరిస్థితులు కారణంగా రాజకీయాల్లో ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదే ఈ సినిమా స్టోరీ.   అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నట్టు సమాచారం. ఒకటి కాలేజీ లెక్చరర్ పాత్ర అయితే.. మరోకటి ఐబీ ఆఫీసర్. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో కాలేజ్ సెట్ వేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘ఇపుడే మొదలైంది’తో పాటు ‘సంచారి’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పుట్టినరోజైన సెప్టెంబర్ 2న ఈ సినిమా టైటిల్ పై అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Bheemla Nayak, Harish Shankar, Mythri Movie Makers, Pawan kalyan, Pooja Hegde

  ఉత్తమ కథలు