హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan | Hari Hara Veera Mallu : దసరా కానుకగా విడుదలకానున్న పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు..

Pawan Kalyan | Hari Hara Veera Mallu : దసరా కానుకగా విడుదలకానున్న పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు..

Pawan Kalyan | Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు హరి హర వీర మల్లు అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఇంకా చదవండి ...

  Pawan Kalyan | Bheemla Nayak : పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్‌లోను మంచి కలెక్షన్స్ దక్కించుకుంది. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాకు హరి హర వీర మల్లు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కోవిడ్ తర్వాత ఆ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీనికి అనేక కారణాలున్నాయి. పవన్ కళ్యాణ్ వేరే సినిమాలతో బిజీగా ఉండడం.. కరోనా ఇలా అనేక కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌లో పవన్ కళ్యాణ్ పాల్గోనబోతున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసే యోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని మేకర్స్ అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్.

  ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇక మరోవైపు పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోదయ సీతమ్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి ధరమ్ తేజ్ మరో కీలకపాత్రలో నటించనున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించారు.

  Eesha Rebba : చీరలో అందంగా అదరగొట్టిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా.. అదరహో అనాల్సిందే..

  ఇక ఆ సినిమాతో పాట పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్. ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ సినిమాను (Surender Reddy) సురేందర్ రెడ్డితో చేస్తున్నట్లు ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మాతగా . సురేందర్ రెడ్డి (Surender Reddy), వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే కథ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో సినిమా ఆగిపోయిందని టాక్.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Hari hara veeramallu, Pawan kalyan, Tollywood news

  ఉత్తమ కథలు