హోమ్ /వార్తలు /సినిమా /

Hari Hara Veera Mallu: తొడకొట్టాడో.. తెలుగోడు.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే వీడియో రిలీజ్

Hari Hara Veera Mallu: తొడకొట్టాడో.. తెలుగోడు.. ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించే వీడియో రిలీజ్

Hari Hara Veera Mallu Power Glance (Photo Twitter)

Hari Hara Veera Mallu Power Glance (Photo Twitter)

HBD Pawan kalyan: నేడు (సెప్టెంబర్ 2) పవన్ బర్త్ డే సందర్భంగా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే వీడియో వదిలారు డైరెక్టర్ క్రిష్. పవన్‌తో తాను చేస్తున్న హరి హర వీరమల్లు సినిమా నుంచి పవర్ గ్లాన్స్ రిలీజ్ చేసి మెగా అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఓ వైపు వరుసగా సినిమాలు చేస్తూనే.. ఏపీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). రాజకీయంగా ప్రజలతో మమేకమవుతూ సినిమా సెట్స్ పై చురుకుగా కదులుతున్నారు. కమిటైన అన్ని సినిమాలు చక చకా కామోపలేట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (సెప్టెంబర్ 2) పవన్ బర్త్ డే (Pawan Kalyan Birthday) సందర్భంగా మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే వీడియో వదిలారు డైరెక్టర్ క్రిష్ (Krish). పవన్‌తో తాను చేస్తున్న హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా నుంచి పవర్ గ్లాన్స్ రిలీజ్ చేసి మెగా అభిమానులకు బిగ్ ట్రీట్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ నటిస్తోన్న లేటెస్ట్ హిస్టోరికల్ ఫిక్షన్ హరి హరి వీరమల్లు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇది వరకే రెండు మూడు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. అయితే ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడింది. అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ బర్త్ డేను పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఖతర్నాక్ పోస్టర్, వీడియో రిలీజ్ చేశారు.

స్వాగతిస్తుంది సమరపథం.. దూసుకొస్తుంది వీరమల్లు విజయరథం !! అంటూ నిన్న క్రిష్ వదిలిన పోస్టర్, నేటి పవర్ గ్లాన్స్ చూసి పవర్ స్టార్ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. తాజా పోస్టర్‌లో స్వారీ చేసుకుంటూ వెళ్తోన్న లుక్కులో పవన్ కళ్యాణ్ లుక్ అదరహో అనిపించింది. భారీ బడ్జెట్‌ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందిస్తున్నారు.

ఇప్పటికే దాదాపు 60 శాతం మేర ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. సమ్మర్ కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని 2023 ఏప్రిల్ 29న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంగీత దిగ్గజం కీరవాణి బాణీలు కడుతున్నారు. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం. ఇది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుందని ఆశ పడుతున్నారు పవన్ అభిమానులు.

Published by:Sunil Boddula
First published:

Tags: Hari Hara Veera Mallu, Pawan kalyan, Tollywood

ఉత్తమ కథలు