HOME »NEWS »MOVIE »pawan kalyan gabbar singh fa e malaika arora trolls her stretch marks in latest gym look ta gh

Malaika Arora: గబ్బర్ సింగ్ భామ మలైకా అరోరా శరీరాకృతిపై నెటిజన్స్ ట్రోలింగ్..

Malaika Arora: గబ్బర్ సింగ్ భామ మలైకా అరోరా శరీరాకృతిపై నెటిజన్స్ ట్రోలింగ్..
మలైకా అరోరా (Instagram/Photo)

Malaika Arora: మలైకా అరోరా ఫిట్నెస్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. 40 ఏళ్లు దాటినా ఫిట్ గా ఉంటూ ఇదే సమయంలో గ్లామర్‌ను కాపాడుకుంటూ వస్తోంది. తాజాగా మలైకా జిమ్‌కు వెళ్లొస్తూ వస్తోన్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

  • Share this:
Malaika Arora: మలైకా అరోరా ఫిట్నెస్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. 40 ఏళ్లు దాటినా ఫిట్ గా ఉంటూ ఇదే సమయంలో గ్లామర్‌ను కాపాడుకుంటూ వస్తోంది. అందం, అభినయంతో ఎప్పుడూ సోషల్ మీడియాలో కనువిందు చేసే ఈ ముద్దుగుమ్మ మరోసారి సామాజిక మాధ్యమాల్లో నిలిచింది. జిమ్ కు వెళ్లి వస్తోన్న మలైకా పొట్టపై స్ట్రెచ్ మార్కులు ఉండడటంలో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.  సెలబ్రెటి ఫొటోగ్రాఫర్ వైరల్ బయానీ ఈ ఫొటోలో క్లిక్ మనిపించారు.
పాప్ పింక్, స్టీల్ గ్రే టైట్స్ ను ధరించిన మలైకా బ్లాక్ మాస్కు పెట్టుకొని కపించింది. అయితే పొట్టపై మడతలు కనిపించడంపై నెటిజన్లు అదే విధంగా స్పందిస్తున్నారు. యోగా గ్లాం దివా యోగా సెంటర్ పేరుతో యోగా స్టూడియోను నడుపుతుంది.



శరీరం, మనస్సు, ఆత్మను సమతూల్యంగా ఉంచడానికి యోగా చేయాలని మలైకా తన అభిమానులను పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ భామ మలైకా.. బోనీ కపూర్ తనయుడు  హీరో అయిన అర్జున్ కపూర్ డేటింగ్ తో చేస్తోంది. ఇద్దరూ కలిసి చాలాసార్లు మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇద్దరూ కలిసి అన్యోన్యంగా ఉన్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో ఎన్నోసార్లు వైరల్ అయ్యాయి.


వైరల్ భయానీ కికాస్ క్యాప్షన్ మలైకా అరోరా హ్యాష్ ట్యాగ్ తో ఆమెను లక్ష్యంగా పెట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. సాగిన మార్కులతో కనిపించినా దుస్తులతో కనిపించిన మలైకా ఎలాంటి బెరుకు లేకుండా కనిపించింది. గర్భం తర్వాత స్ట్రెచ్ మార్కులు సాధారణమని తెలిపింది. ప్రస్తుతం #stretchmarks #malaikaarora హ్యాష్ ట్యాగులు ట్రెండ్ అవుతున్నాయి.




ఇటీవలే మలైకా అర్జున్ కపూర్ తో కలిసి గోవాలో తళుక్కుమంది. నూతన సంవత్సరం సందర్భంగా ఇద్దరూ కలిసి బీచ్‌లో తెగ ఎంజాయ్ చేసారు.  అక్కడ మలైక బికినీలో ఫోజులిచ్చిన ఫోటోలు  సోషల్ మీడియాలో హీట్ పెంచింది. అంతేకాకుండా చిరునవ్వులు చిందిస్తూ నీటిలో కనవిందు చేసింది. అంతేకాకుండా నవ్వులు చిందిస్తూ ఆనందంగా ఉండండి.. 2021ను గ్లోరియస్ గా చేయండి. హ్యాపీ సండే అని పోస్ట్ పెట్టింది.




అంతేకాకుండా మలైక తన అభిమానుల కోసం నూతన ఏడాది కోసం ఫోజులిచ్చేసింది. వీరిద్దరూతో పాటు మలైక చెల్లెలు అమృత కూడా తన కుటుంబంతో కలిసి చేరింది. అర్జున్ కపూర్ తో అత్యంత సన్నిహితంగా ఉంటూ అతడి భుజంపై చేయి వేసి ఉంది. అర్జున్, మలైకా తమ సంబంధాన్ని ఖండించకపోగా.. వారు కలిసి అనేక ఫొటోలను ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. మలైక, అర్జున్ కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ తో కలిసి ధర్మశాలలో ఒకరితో ఒకరు కలిసి ఎంతో హాలీడేస్‌ను ఎంజాయ్ చేసారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 27, 2021, 22:47 IST

टॉप स्टोरीज